తెలంగాణ

సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ఆదివారంనాటి జనతా కర్ఫ్యూకు ప్రధాని పిలుపునిస్తూ, ఈ కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు ప్రజలంతా తమ తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని, ప్రజలు ఎవరికి వారు ఎక్కడ ఉన్నా చప్పట్లు కొడుతూ లేదా గంటలు మోగిస్తూ కరోనా నివారణ కోసం పాటుపడుతున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర శాఖల వారికి కృతజ్ఞతలు చెప్పాలని సూచించారు. ప్రధాని పిలుపును అపహాస్యం చేస్తూ కొంతమంది సోషల్
మీడియాలో అవహేళనగా పోస్టులు పెట్టారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా పోస్టులను ‘ఈడియట్లు, పనికిరాని వారు’ చేసిన పనిగా సీఎం అభివర్ణించారు. ఈ విధంగా పోస్టులు పెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, చర్యలు తీసుకోవాలంటూ వేదికపైనే ఉన్న డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆయన ఆదేశించారు. ప్రధాని పిలుపుమేరకు తాను తన కుటుంబ సభ్యులు కూడా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లు కొట్టే కార్యక్రమంలో పాల్గొంటామని సీఎం వెల్లడించారు. చాలా దేశాలు తమ ఐక్యతను చాటేందుకు, సాలిడారిటీని ప్రకటించేందుకు ఈ విధమైన కార్యక్రమాలు చేపడతాయని ఆయన గుర్తు చేశారు.