తెలంగాణ

మహమ్మారి అడ్డుకట్టకు హోమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కరోనా వైరస్ నివారణకు రాష్ట్రంలోని దేవాలయాల్లో హోమాలు నిర్వహించేందుకు అనుమతిస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తెలిపారు. ప్రగతి భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ‘ఆంధ్రభూమి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సీఎం జవాబు చెబుతూ, విపత్కర పరిస్థితుల్లో, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఆలయాల్లో హోమాలు చేస్తుంటారన్నారు. రాష్ట్రంలోని ఆలయాల్లో హోమాలు చేసేందుకు అనుమతిస్తామని, ఎవరికి వారు హోమాలు చేయవచ్చని, అలాగే ప్రభుత్వపరంగా దేవాలయాల్లో హోమా లు చేసేందుకు అనుమతిస్తామన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో ఇప్పటికే మాట్లాడానని, హోమాలు ఏవిధంగా చేయాలి, ఏఏ దేవాలయాల్లో చేయాలన్న అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని సీఎం చెప్పారు. హోమాలు చేయడం మంచిదేనని సీఎం అన్నారు. సనాతనధర్మంలో ప్రజల సంక్షేమానికి, వైపరీత్యాల నివారణకు హోమాలు చేస్తూ వస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వపరంగా ఈ అంశంపై సానుకూలంగా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.