తెలంగాణ

సరిహద్దుల్లో ప్రత్యేక భద్రత.. చెక్‌పోస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: ప్రపంచ దేశాలను వణికిస్తూ భారత్‌లోనూ చాపకింద నీరులా పారుతున్న కరోనా వైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి ఎక్కువగా వైరస్ ఉంటుండడంతో అధికారులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌కు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. వారిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. విదేశాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు వస్తున్న వారిని ముందుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న వారికోసం పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దింపింది. కొన్ని ఇళ్లకు వెళ్లి మీ ఇంట్లో ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం, న్యుమోనియా, శ్వాసకోశ వంటి వ్యాధులతో బాధపడుతున్నారా అన్న విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ హైదరాబాద్‌పై ఎక్కువగా పడింది. దీంతో ప్రజలు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నగరంలో చార్మినార్ మక్కా మసీదు మొదలుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనలకు గతంలో ఉన్న మాదిరిగా హాజరుకాలేదు. ఆయా ప్రధాన మసీదుల వద్ద ప్రార్థనల సమయంలో మసీదులు రద్దీగా కనిపించేవి. కానీ శుక్రవారం జరిగిన ప్రార్థనల్లో అతి తక్కువ మంది పాల్గొనడం ఇందుకు నిదర్శనం. కరోనా వ్యాధి కారణంగా హైదరాబాద్ నగరంలోని రోడ్లన్నీ బోసిపోయాయి. ప్రధాన రోడ్లపై జనం లేకపోవడంతో రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత, చెక్‌పోస్టులను పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతతో పాటు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌ల్లో ప్రత్యేక పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేశారు. సభలు, సమావేశాలు, వివాహాలకు అనుమతులను నిరాకరిస్తున్నట్లు పోలీసు శాఖ స్పష్టం చేసింది. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని పోలీసు శాఖ కోరింది. జనతా కర్ఫ్యూపై మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు.
*చిత్రం...: డీజీపీ మహేందర్ రెడ్డి