తెలంగాణ

వైద్య విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 5: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో మెడికో విద్యార్థి ఎం.ఎస్.వౌనికయాదవ్ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. కెఎంసి లేడిస్ హాస్టల్ రూం నంబర్ 19లో ఉంటున్న వౌనిక ఈ రోజు అనారోగ్యంగా ఉందంటూ క్లాస్‌కు వెళ్లలేదు. తోటి విద్యార్థులు క్లాస్‌కు వెళ్లి తిరిగొచ్చే వరకు డోర్ పెట్టే ఉండడంతో అనుమానం వచ్చి కిటికి తెరిచి చూడగా వౌనిక ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉంది.
వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఎలాంటి సూసైడ్ నోట్ కూడా అక్కడ లేదని పోలీసులు తెలిపారు. జనవరి 22 నుండి ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉన్నందున ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయినపల్లి హెచ్‌ఏఎల్ కాలనీకి చెందిన ఎంఎస్ సుభాష్ యాదవ్ కూతురు వౌనిక యాదవ్ కెఎంసిలో ఎంబిబిఎస్ నాల్గో సంవత్సరం చదువుతుంది. ఎంజి ఎంలో జూనియర్ డాక్టర్‌గా కూడా పని చేస్తుంది. ఈ విషయాన్ని పోలీసులు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.