తెలంగాణ

కుప్పకూలిన భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, జూలై 24: హైదరాబాద్ ఫిలింనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. శ్లాబ్‌తోపాటు 14 పిల్లర్లు నేలమట్టమయ్యాయి. ఆదివారం చోటుచేసుకున్న ప్రమాదంలో శిథిలాల కింద ఇద్దరు నలిగి మృతిచెందగా, 8మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అపోలో ఆసుపత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ భవన నిర్మాణం రెండు నెలలుగా నిర్మాణంలో ఉంది. భవనం పైభాగంలో శ్లాబ్ పనులు కొనసాగుతున్నాయి. రెండో అంతస్తులో కొనసాగుతున్న పనులు శనివారం రాత్రి గం. 10.30 వరకూ కొనసాగాయి. కాగా ఆదివారం మరో అంతస్తుపై శ్లాబ్ వేసే క్రమంలో కూలీలంతా భవనం పైకి ఎక్కారు. ఉదయం గం. 11.00లకు ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన షేక్ అన్సూర్ (30), కర్నాటకకు చెందిన ఆనంద్ (35) మృతి చెందారు. భవనం కూలిన సమయంలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్నాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులు శ్రీనివాస్ (29), శివ (31), మల్లేష్ (25), మాధవ్ (22), కోటేశ్వరరావు (35), సీతారాం (32), అజిత్ (29), బీరప్ప (35) గాయపడ్డారు. క్షతగాత్రులు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సంఘటన సమాచారం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రాంమ్మోహన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సిఎం కెసిఆర్, హోంమంత్రి దిగ్భ్రాంతి
ప్రమాద ఘటనపై సిఎం కెసిఆర్, హోంమంత్రి నాయిని నార్సింహరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు నివాళి, బాధిత కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని సిఎం ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా
మృతుల కుటుంబాలకు మేయర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కొకరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను జిహెచ్‌ఎంసి ప్రకటించింది. ప్రమాద స్థలాన్ని సందర్శించిన నగర మేయర్ బొంతు రామ్మోహన్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతి లేదని, క్లబ్ నిర్వాహకులపై చర్య తీసుకుంటామని తెలిపారు. నాణ్యత లోపించడం వల్లే ప్రమాదం సంభవించిందని, ప్రమాదానికి కారుకులైన వారిపై చర్య తీసుకోవాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై చర్య తీసుకుంటామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సమచారం తెలిసిన వెంటనే ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు.
ఘటనాస్థలిని పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ పోలీస్, ఫైర్, ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలతోపాటు జిహెచ్‌ఎంసి సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. ఇదిలావుంటే, కల్చరల్ క్లబ్ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌పై బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కల్చరల్ క్లబ్ అధ్యక్షుడు కెఎస్ రామారావు, సెట్రరీ రాజశేఖర్‌రెడ్డి, ఇంజనీర్ సుధాకర్‌రావు, కాంట్రాక్టర్ కొండల్ రావు, లేబర్ కాంట్రాక్టర్ శివపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
స్పందించిన కల్చరల్ క్లబ్
ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటనపై నిర్మాత సి కళ్యాణ్ స్పందించారు. క్లబ్‌లో నిర్మిస్తున్నది భవనం కాదని, కేవలం పోర్టికో అన్నారు. ప్రమాదానికి క్లబ్ సభ్యులంతా బాధ్యత వహిస్తారని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్టు కల్చరల్ క్లబ్ కమిటీ ప్రకటించింది. గాయపడిన వారిని ఆదుకుంటామని, వైద్య ఖర్చులు భరిస్తామని ఎఫ్‌ఎన్‌సిసి తెలిపింది.