తెలంగాణ

రాజీవ్ రోడ్డుపై రణరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/ కొండపాక, తొగుట: జూలై 24: మల్లన్నసాగర్ ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఈ ప్రాజెక్టు వల్ల తాము భూములు కోల్పోతామనే ఆందోళనతో పెద్ద సంఖ్యలో ముంపునకు గురయ్యే గ్రామాల రైతులు ఆదివారం రాజీవ్ రహదారి ముట్టడికి బయలుదేరడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన కారులను వేములగాట్, ఎర్రవెళ్లి గ్రామాల్లో పోలీసులు చెదరగొట్టారు. ఎర్రవెళ్లి గ్రామంలో పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిర్వాసితులు ఆందోళనకు దిగారు. దీంతో ఎర్రవెళ్లి గ్రామంలో భారీ బలగాలను మొహరింపచేశారు. గ్రామంలో 144 సెక్షన్‌ను విధించి పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. దీంతో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతందోనని ప్రజలు ఆందోళన గురవుతున్నారు. మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవెళ్లి గ్రామం, తొగుట మండలం వేములగాట్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన తొగుట మండలం వేములగాట్ గ్రామస్థులు రాజీవ్ రహదారి ముట్టడికి బయలుదేరడంతో పోలీసులు అడ్డుకుని లాఠీ చార్జీ చేశారు. నిర్వాసితులు బెదరకుండా ముట్టడికి ర్యాలీగా బయలు దేరారు. వారికి మద్దతుగా ముంపు గ్రామాలైన పల్లెపహడ్, సింగారం గ్రామాలకు చెందిన వందలాది మంది నిర్వాసితులు కలిసి ఎర్రవెళ్లికి చేరుకోగానే ఆ గ్రామస్థులు సైతం తోడైనారు. సిద్దిపేట, సంగారెడ్డిల డిఎస్పిలు శ్రీ్ధర్, తిరుపతన్నల ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలతో నిర్వాసితులను అడ్డుకున్నారు. పోలీసులు నిర్వాసితులు రాజీవ్హ్రదారి వైపు వెళ్లకుండా అడ్డుగా నిలువడంతో నిర్వాసితులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. అంతవరకు కొంత సంయమనంగా ఉన్న నిర్వాసితులు కొందరు ఒక్కరు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పినా నిర్వాసితులు బెదురకుండా ఎదురుదాడులు కొనసాగించారు. దీంతో ఓ పోలీసు అధికారి రివాల్వర్‌తో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నిర్వాసితులను చెదరగొట్టి పరిస్థితులను కొంతవరకు అదుపులోకి తెచ్చారు. పోలీసులు, సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రాళ్లదాడిలో కుకునూర్ పల్లి ఎస్‌ఐ రామకృష్ణరెడ్డి, కొంత మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో రెచ్చిపోయిన పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. ముంపు బాధితులు ఇళ్లలోకి పరుగులు తీసిన పోలీసులు వెళ్లి కొట్టడం గమనార్హం. దీంతో ఎర్రవెళ్లికి చెందిన బుచ్చయ్యకు కాలు ఫాక్చర్ కాగా, ఎంపిటిసి ఐత మంజుల, తెలుగు రైతు అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, 15మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరికొందరు నిర్వాసితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఆర్‌ఎఎఫ్, ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించి గ్రామంలో ప్రదర్శన నిర్వహించి...గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి 8-30 గంటలైన గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇప్పటికీ ఏప్పుడు ఏం జరుగుతందోనని ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.

చిత్రం... రాజీవ్ రహదారిపై భూనిర్వాసితుల ఆందోళన