రాష్ట్రీయం

ఉష్ణోగ్రతలే అసలు సమస్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 24: రాష్ట్ర విభజన జరిగినప్పటికీ హైదరాబాద్, బెంగళూరుల్లో ఉన్న సొంత రాష్ట్ర ప్రజలు తిరిగి రాకపోవడానికి కారణం, ఏపిలో ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో ఉన్న వాతావరణ సమస్యలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించారు. అందుకే దశల వారీగా భారీస్థాయిలో మొక్కల పెంపకం ద్వారా, రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు విజన్ 2029ను నిర్దేశించుకున్నారు. వేడి తగ్గించి, చల్లదనం తీసుకురావాలంటే మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని గుర్తించారు. అందులో తొలి అడుగుగా ఈ నెల 29న కోటి మొక్కలు నాటాలని నిర్ణయించారు. గత కొద్దిరోజుల నుంచి బాబు రాష్ట్రాన్ని సగానికిపైగా పచ్చదనంతో నింపే ప్రణాళికలపై దృష్టి సారించారు. 25-30 కోట్ల మొక్కలను నాటడం ద్వారా ఇప్పుడున్న పచ్చదనాన్ని మరింత పెంచాలన్న ప్రణాళికలకు పదునుపెడుతోంది.
విభజనకు దశాబ్దాల ముందు వరకూ ఏపికి చెందినవారు హైదరాబాద్‌కు వలసవెళ్లారు. రాయలసీమకు చెందిన వారిలో ఎక్కువ మంది బెంగళూరు, నెల్లూరుకు చెందిన వారిలో అధిక శాతం చెన్నైకు వలస వెళ్లారు. హైదరాబాద్‌లో వాతావరణం అనుకూలంగా ఉండటం, వేసవికాలంలో కూడా సాయం తర్వాత చల్లగా ఉండటం, ఉక్కబోత లేకపోవడంతో వలస వెళ్లిన ప్రజలు, హైదరాబాద్ వాతావరణానికి అలవాటుపడ్డారు. బెంగళూరులో ఉన్న చల్లటి వాతావరణానికి సీమవాసులు మమేకమయ్యారు.
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం వంటి జిల్లాల్లో విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుంది. వేసవిలో 47 డిగ్రీలు కూడా దాటుతున్న సందర్భాలున్నాయి. రెంటచింతల, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, దర్శి, ఒంగోలు వంటి ప్రాంతాల్లో జనం పిట్టల్లా రాలిపోతుంటారు. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే చల్లటి వాతావరణం కనిపిస్తుంటుంది. సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా దానికి ప్రత్యామ్నాయంగా మొక్కలు పెంచడం ద్వారా వాతావరణ సమతుల్యం సాధించే ప్రయత్నం చేయలేకపోయాయి. అది ఇప్పుడు వలసలు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు ప్రధాన అవరోధంగా మారిందని బాబు ప్రభుత్వం గుర్తించింది.
ప్రధానంగా అమరావతి చుట్టూ ఉన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉండే అధిక ఉష్ణోగ్రత.. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆయా జిల్లాల వారికి భయాందోళన కలిగిస్తోంది. ఈ భయంతోనే రాష్ట్రం విడిపోయి రెండేళ్లయినా హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లిన వారెవరూ అమరావతి పరిసర జిల్లాలకు, తిరిగి వెనక్కి రాలేకపోతున్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపితే వలసలు తగ్గించడంతోపాటు, వెనక్కివెళ్లినవారిని తిరిగి తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న 25.64 శాతం పచ్చదనాన్ని 2029 నాటికి రెట్టింపు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 37వేల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉండగా, భౌగోళిక విస్తీర్ణం ప్రకారం ఈ సంఖ్య 23 శాతం మాత్రమే. అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి, మొక్కల పెంపకం ద్వారా మరో 17 శాతం పచ్చదనం పెంచాలని భావిస్తోంది. వచ్చే ఐదేళ్లలో 6లక్షల హెక్టార్లకు పచ్చదనాన్ని విస్తరించాలని అటవీశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. దానికోసం 75 కోట్ల విత్తనాలు సిద్ధం చేసి, ఏపి ఏటా 15 కోట్ల విత్తనాలతో లక్ష్యాన్ని సాధించాలని యోచిస్తోంది. ఏదిఏమైనా చంద్రబాబు నాయుడు ఆశయం సిద్ధించి వలసవెళ్లిన వారంతా వెనక్కి తిరిగివస్తారని ఆశిద్దాం.