తెలంగాణ

భారత్ దూసుకుపోతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, జూలై 24: ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతూ అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తోందని, వ్యవసాయ రంగంపై ఆధారపడిన మన దేశంలో నూతన వ్యవసాయ ఉత్పత్తులపై యువశాస్తవ్రేత్తలు దృష్టి కేంద్రీకరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పిలుపునిచ్చారు.
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం మామిడిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సింబాయసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఆయన ఆదివారం ప్రారంభించారు. దేశంలో 90 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవన విధానం కొనసాగిస్తున్నారని, ఈ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యువశాస్త్ర వేత్తలు బయటకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోవడం వల్ల ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా దేశంలో వ్యవసాయ రంగాన్ని విస్తరించడంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తులను పెంచాలని మంత్రి సూచించారు.
వ్యవసాయ వృద్ధిరేటును పెంచేందుకు ప్రభు త్వం ఎన్నో ప్రోత్సాహకాలను అందజేస్తోందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిడిపి రేటు సైతం దినదినాభివృద్ధి సాధిస్తోందని, నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయిన తరువాత దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడిందని ఆయన అన్నానరు. దేశంలో పెరుగుతున్న జనాభా ప్రకారం విద్యావ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు. విద్యార్థులు నూతన సాంకేతిక విద్యను అందించడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటి రంగం ఎక్కువగా విస్తరించి ఉందని, హైదరాబాద్‌ను ఐటి హబ్‌గా ఏర్పాటు చేశారని, ఇలాంటి చక్కటి అవకాశాలను యూనివర్సిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సింబాయసిస్ యూనివర్సిటీ భారతదేశంలోనే మూడవదని, హైదరాబాద్ సమీపంలో ఈ వర్సిటీని ఏర్పాటు చేయడం రాష్ట్రానికి మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో అనేక భారీ పరిశ్రమలు స్థాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు, ఎంపి జితేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు వై.అంజయ్య యాదవ్, జి.కిషన్‌రెడ్డి, యూనివర్సిటీ ఫౌండర్ ఎస్‌బి ముజేందర్, డైరెక్టర్ డాక్టర్ విద్యయేరవ్‌దేకర్, వైస్ చాన్సలర్ రజినిగుప్త తదితరులు పాల్గొన్నారు.

సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ