తెలంగాణ

లారీని ఢీకొన్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, జూలై 25: కర్నూల్ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్నూల్ పట్టణానికి చెందిన ఒక కుటుంబం తమ అల్లుడిని దుబాయి పంపించాలని ఆదివారం హైదరాబాద్‌కు వెళ్లి విమానం ఎక్కించి కారులో సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు-జల్లాపురం స్టేజీల మధ్యలో ముందుగా వెళ్తున్న లారీని వెనుకనుంచి వారి వాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూల్ పట్టణంలోని వడ్డెగేరి ప్రాంతానికి చెందిన నాసీర్‌మియ్యాఅహ్మద్, రిజ్వాన్‌ఖాతూమ్, ఫర్జానాఖాతూమ్, హనియాఖాతూమ్, హజీన్‌ఖాతూమ్, షోయబ్‌అలీఖాన్ టిఎస్11ఇజి 5409 నంబర్ గల కారులో ఆదివారం హైదరాబాద్‌కు వెళ్లి షోయబ్‌అలీఖాన్‌ను దుబాయి ప్రయాణం నిమిత్తం విమానం ఎక్కించారు. సోమవారం ఉదయం తిరుగు ప్రయాణంలో పది నిమిషాల్లో గమ్యానికి చేరుతారనగా మృత్యువు రూపంలో జల్లాపూర్ స్టేజి సమీపంలో కెఎ01ఎఇ 5917 గల సిమెంటు కంటైనర్ లారీని వెనుక భాగం నుంచి కారు ఢీకొనడంతో నాసీర్‌మియ్యఅహ్మద్ (62), రిజ్వాన్‌ఖాతూమ్ (52), ఫర్జానాఖాతూమ్ (25), హనియాఖాతూమ్ (04) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన హజీన్‌ఖాతూమ్ 108 అంబులెన్స్‌లో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని అలంపూర్ సిఐ వెంకటేశ్వర్లు, అలంపూర్ ఎస్‌ఐ పర్వతాలు పరిశీలించారు. మృతుదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

చిత్రం.. ప్రమాదంలో మృతి చెందిన ఒకే కుటుంబ సభ్యులు