తెలంగాణ

నిర్వాసితులపై దాడి అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 25: తెలంగాణ రాష్ట్రంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకున్న నిర్వాసితులపై ప్రభుత్వం నిరంకుశంగా దాడులకు పాల్పడటం అన్యాయమని, ఈ దాడుల్లో 28 మంది తీవ్రంగా గాయపడగా, ఒక మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలిపారు. ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన ప్రజల్ని అదుపు చేసేందుకు గాలిలోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ఆందోళనకారులకు సంఘీభావం తెలిపేందుకు, బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టిడిపి నేతల్ని అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, తదితరులను అరెస్ట్ చేశారన్నారు. తెలంగాణలో పోలీసు ఆటవిక రాజ్యం కొనసాగుతోందని ఆయన సోమవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టు విషయానికొస్తే ఒక టిఎంసి నీటిని మాత్రమే అక్కడ రిజర్వ్ చేసుకునే పాత ప్రతిపాదన స్థానంలో దాన్ని 50 టిఎంసిలకు పెంచి 60వేల కోట్ల రూపాయలు దోచుకునేందుకు రూపకల్పన చేశారని నారాయణ ఆరోపించారు. డిజైన్‌పై వివరాలు చెప్పకుండా, కనీసం ప్రతిపక్షాలతో మాట్లాడకుండా ఇష్టానుసారంగా నిర్మాణం చేపట్టారన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని, కనీసం సంప్రదించలేదన్నారు. రాజకీయ పార్టీలను లెక్కచేయకుండా, స్థానిక ప్రజలు అసంతృప్తితో వున్నా మంకుపట్టుతో కెసిఆర్ ముందుకెళ్తున్నాడని, పైగా పరామర్శించడానికి వెళ్లిన నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయించటం దారుణమన్నారు. ఈ ప్రాజెక్టులో గోల్‌మాల్ వ్యవహారం చూస్తుంటే రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే డబ్బులు కూడగట్టుకునే ప్రయత్నంలో కెసిఆర్ వున్నట్లు అర్థమవుతోందని, దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా ఆగస్టు 17న ధరల వ్యతిరేక ఆందోళన చేపట్టనున్నామని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేట్‌పరం చేసేందుకు సాగుతున్న కుట్రల్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 2న పెద్దఎత్తున జాతీయ స్థాయిలో జరిగే సార్వత్రిక సమ్మెకు సిపిఐ మద్దతు తెలుపుతున్నట్లు నారాయణ చెప్పారు.