తెలంగాణ

ప్రాణం పోయనా.. ఎత్తు పెంచనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 25: తరాల తరబడి తాము భూమిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఎవుసం చేసుకుంటూ వచ్చిన ఆదాయంతోనే జీవనం కొనసాగిస్తున్నాం..మెట్ట ప్రజలకోసం తమ గ్రామాల్లోప్రాజెక్టులు కడుతున్నామంటే సంతోషించాం...నీటినిల్వ కోసం భూమి కావాలంటే సాగులేకున్నా సరే తోటి రైతులకే లాభం కల్గుతుందనే భావనతోభూములిచ్చాం. ఇచ్చిన కాడికే పరిహారం తీసుకున్నాం. అయితే, ఎత్తు పెంచుతున్నామంటూ మిగిలిన భూమిని కూడా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతూ తమపై దాష్టీకం ప్రదర్శిస్తోందని, ఎవరి లాభం కోసం ప్రాజెక్టుల ఎత్తు పెంచుతుందో అందరికీ తెలుసని, చావనైనా చస్తాం కానీ, ప్రాజెక్టుల ఎత్తు మాత్రం పెంచనీయమంటూ జిల్లాలోని గౌరవెల్లి, గండిపల్లి, అనంతసాగర్ గ్రామాలకు చెందిన ప్రజలు, ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూములు కోల్పోతున్న వారు సోమవారం కలెక్టరేట్ సాక్షిగా శపథం చేశారు. రైతుల నోట్లో మట్టికొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుండటాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడిలోవందలాది మంది ప్రజలు ర్యాలీగా చేరుకుని ప్రధానద్వారం ఎదుట బైఠాయించారు. ప్రాజెక్టు పేర ప్రభుత్వం మా పొట్టగొట్టేయత్నం చేస్తుందని, తలాపున గోదారి ఉన్నా తాగునీటికోసం తండ్లాడుతున్న జిల్లాప్రజానీకాన్ని కాదంటూ ఇక్కడి నీటిని తనకనుకూలమైన ప్రాంతానికి తరలించుకునేందుకు ముఖ్యమంత్రి యత్నిస్తున్నారనే నినాదాలతో హోరెత్తించారు. ప్రాజెక్టుల నిర్మాణంతోముంపుకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పునరావాస చర్యలు చేపట్టకుండానే పనులు కొనసాగిస్తున్నారని, తమకు పరిహారం పంపిణీ చేయటంలో కూడా వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకో న్యాయం..మాకో న్యాయమా అని ప్రశ్నించారు. జీవోనెం.123ని వెంటనే ఉపసంహరించుకుని, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్‌ల నిర్మాణంపై తమతో సమావేశాలెందుకు ఏర్పాటుచేయటం లేదోప్రకటించాలన్నారు. వీరి ఆందోళనకు మద్దతుగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేశ్ మాట్లాడుతూ, ప్రాజెక్టుల ఎత్తు తగ్గించకుంటే జరుగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. నీటి ఎద్దడితో సతమతమవుతున్న కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తాగు,సాగునీరందించకుండా తన ఫామ్‌హౌజ్‌కోసం నీటిని తరలించుకుపోవటం దుర్మార్గమన్నారు. మల్లన్నసాగర్ పోరాటానికి ధీటుగా జిల్లాలో ప్రాజెక్టుల భూనిర్వాసితులు ఉద్యమాలు కొనసాగిస్తారన్నారు. ఈసందర్బంగా ఆందోళనకారులు కలెక్టరేట్ లోనికి చొచ్చుకెళ్ళేయత్నం చేశారు. పోలీసులకు,వారికి తోపులాట జరిగింది. పోలీసులు నచ్చచెప్పినా వినకపోవటంతో ఆందోళనకారులను బలవంతంగా పోలీసులు తమ వాహనాల్లో ఒకటోపట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, నాయకులు గడిపె మల్లేశ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు గంభీరపు వివేకానంద్, బొడిగె కొంరయ్య, కోహెడ సృజన్‌కుమార్, పైడిపల్లి రాజు, బోయిని అశోక్, కర్రె భిక్షపతి, బూడిద సదాశివ, పొనగంటి కేదారి, కూనశోభారాణితో పాటు 500మంది నిర్వాసితులు పాల్గొన్నారు.

చిత్రం.. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేస్తున్న
గండిపెల్లి, గౌరవెల్లి గ్రామాల భూనిర్వాసితులు