తెలంగాణ

వర్షాలు కురుస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట, జూలై 25: సకాలంలో వర్షాలు కురుస్తాయని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తనకు సంతృప్తినిస్తున్నాయని సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి రంగం కార్యక్రమంలో అవివాహిత స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. ఆషాఢమాసం బోనాల జాతరలో భాగంగా సికిందరాబాద్ బోనాల సందడి రెండోరోజు కూడా కొనసాగింది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించిపోయారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం దేవాలయం ఆవరణలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి విన్పిస్తూ భక్తులు పండుగను వివిధ రూపాల్లో చేసుకుంటున్నారే తప్పా, నన్ను మర్చిపోతున్నారని గుర్తుచేశారు. తనకు రక్తతర్పణం చేయాలని కోరగా, ఆలయ నిర్వాహకులు అందుకు అంగీకరించారు. అనంతరం అమ్మవారిని పురవీధుల్లో అంబారీపై ఊరేగించారు. కొద్ది సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న నరేష్‌కుమార్ తీసుకువచ్చిన అంబారీపై అమ్మవారు ఊరేగుతూ భక్తులకు ఆశీస్సులను అందజేశారు. ఊరేగింపును మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఆలయ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ అన్నపూర్ణ, కార్పొరేటర్ అత్తెలి అరుణాగౌడ్ ప్రారంభించారు. ఊరేగింపులో భాగంగా అంబారీ ముందు వివిధ రకాల కళా బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చాయి. విజయవాడకు చెందిన కళాబృందం పోతరాజుల నాట్య విన్యాసాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహంకాళీ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు పురవీధుల మీదుగా జనరల్ బజార్, బాటా, మోండా మార్కెట్, అల్ఫా హోటల్ మీదుగా సాగి తిరిగి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. నార్త్‌జోన్ పోలీసులు ఊరేగింపుకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

సోమవారం లష్కర్ ‘రంగం’లో భవిష్యవాణి చెబుతున్న స్వర్ణలత