తెలంగాణ

విద్యార్థుల సమస్యలపై ఎన్‌ఎస్‌యుఐ ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: విద్యార్థుల సమస్యలపై ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్ తెలిపారు. ఫీ-రీయంబర్స్‌మెంట్, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, విద్యాసంవత్సరం ప్రారంభమైనా అనేక ప్రభుత్వ విద్యా సంస్ధల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, డిగ్రీ అడ్మిషన్ల కోసం చేపట్టిన ఆన్‌లైన్ ప్రక్రియ ఫార్స్‌గా మారడం వంటి అంశాలు, విద్యార్థుల సమస్యలపై ఆందోళనలు ఉధృతం చేయనున్నట్లు వెంకట్ సోమవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఇంటర్ పాసై డిగ్రీలో చేరాలనుకున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానంలో అనేక లొసుగులు ఉన్నాయని ఆయన విమర్శించారు. ఒకటి, రెండో కౌన్సిలింగ్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ నెల 25న ప్రారంభమైన మూడో కౌన్సిలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి వీలులేదని ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. కళాశాల దూరమైనప్పుడు, లేదా ఇంకా ఏదైనా సమస్య ఉందనుకున్నప్పుడు విద్యార్థి స్వేచ్ఛగా మూడో కౌన్సిలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి అనేక సమస్యలపై ఈ నెల 27న నల్లగొండ జిల్లా నుంచి రోజుకో జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 28న ఖమ్మం, 29న వరంగల్, 30న కరీంనగర్, ఆగస్టు 1న ఆదిలాబాద్, 2న నిజామాబాద్, 3న మెదక్, 4న రంగారెడ్డి జిల్లా, 5న హైదరాబాద్, 6న మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. చివరగా 7న ఉస్మానియా వర్సిటీ ఆవరణలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెంకట్ చెప్పారు.