తెలంగాణ

ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25 : తెలగాణ రాష్ట్రంలోని ఫెర్రోఅల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ రాయితీని కొనసాగించాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు చైర్మన్‌గా ఏర్పాటైన ఐదుగురు మంత్రులతో కూడిన ఉపసంఘం పలుదఫాలుగా సమావేశమై ఈ అంశంపై సమీక్షించింది. ఉపసంఘంలో వాణిజ్యపన్నులు, పంచాయితీరాజ్, విద్యుత్తు, ఆర్థిక శాఖల మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్తును ఒక్కో యూనిట్‌కు 1.50 పైసల చొప్పున సబ్సిడీగా భరించాలని నిర్ణయించింది. 2016-17 సంవత్సరానికి ఇందుకోసం అవసరమైన 39.34 కోట్ల రూపాయలను ప్రభుత్వం భరించాలని నిర్ణయించారు. పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాలకు కేటాయించిన నిధుల నుండి ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.