తెలంగాణ

గెలుపు ధీమా లేకే రిజర్వేషన్లలో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ధైర్యం లేకే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను జాప్యం చేస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. రిజర్వేషన్లు ప్రకటించిన రోజునే నోటిఫికేషన్ విడుదల చేయరాదని, రిజర్వేషన్లపై అభ్యంతరాలు తీసుకోవడానికి కనీసం 10 రోజుల గడువు ఇవ్వాలని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మేచినేని కిషన్‌రావు, పార్టీ నాయకులు ప్రకాశ్‌రెడ్డి, ఎస్. కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణ తీరును ప్రభుత్వం దిగజారుస్తున్నదని విమర్శించారు. ఎన్నికల నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగిసిన నాలుగైదు రోజులకే పోలింగ్ నిర్వహించేలా ప్రభుత్వం జివో తేవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. జిహెచ్‌ఎంసి పరిథిలోని 150 డివిజన్లను 200లకు మార్చాలని తొలుత ఆలోచన చేసిన ప్రభుత్వం ఆ వెంటనే ఉపసంహరించుకున్నదని అన్నారు. డివిజన్లు పెరిగితే టిడిపి-బిజెపి అధికంగా సీట్లు గెలుపొంది మేయర్ స్థానం దక్కకుండా టిఆర్‌ఎస్‌కు దక్కకుండాపోతుందన్న భయంతోనే ప్రభుత్వం చివరకు 150 సీట్లనే కొనసాగిస్తున్నదని ఆయన తెలిపారు. టిడిపి-బిజెపికి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో భారీగా ఓట్లను తొలగించారని విమర్శించారు. బహదూర్‌పురా నియోజకవర్గంలో 350 ఓట్లను తొలగిస్తే, టిడిపి-బిజెపి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో లక్ష ఓట్ల వరకు తొలగించారని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో గృహనిర్మాణం పథకం లబ్దిదారుల ఎంతమందో చెప్పి, వారిని చూపించి ఓట్లు అడగాలని అన్నారు. సచివాలయంలో ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువాలు కప్పి టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో జాతీయ రోడ్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుమారు 43 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించడం హర్షణీయమని, అయితే కెసిఆర్ కుటుంబానికి భయపడి అది ఇవ్వలేదని అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని అభినందిస్తూ ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల ఉత్తరాలను కేంద్రానికి పంపించాలని నిర్ణయించినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.

కిడ్నీ విక్రయాలపై
పోలీసుల దర్యాప్తు
వివరాల సేకరణ పురోగతిలో
నల్లగొండ రూరల్, జనవరి 5: పేదరికంలో ఉన్న మనుషుల ఆర్ధిక అవసరాలే తన ఆదాయ వనరుగా మార్చుకుని కిడ్నీల అమ్మకాలను ప్రొత్సహిస్తూ జల్సాలతో జీవిస్తున్న ఓ యువకుడి కిడ్నీల దందాపై అందిన ఫిర్యాదులపై కదిలిన నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఈ దిశగా విచారణ మొదలుపెట్టింది. నల్లగొండ పట్టణ శివారులోని గంధంవారిగూడెంకు చెందిన ఓ యువకుడు కొన్ని నెలల క్రితం ఇంటర్నెట్‌లో కిడ్నీల దాతలు కావాలన్న ప్రకటనను చూసి తనకు డబ్బు వస్తుందన్న ఆశతో మహారాష్టక్రు వెళ్లి తన కిడ్నీని 5లక్షలకు అమ్ముకున్నాడు. తదుపరి తనకు పరిచయమున్న స్థానిక అబ్బాసియా కాలనీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగం నుండి సస్పెండ్ కాబడిన మరో వ్యక్తికి చెందిన కిడ్నీని కూడా 5లక్షలకు అమ్మించాడు. వచ్చిన వాటితో బైక్‌లు కొనుగోలు చేసి, విలాసవంతమైన జీవితం సాగించడం మొదలుపెట్టారు. అయితే తనలాగే ఇతరుల కిడ్నీలను కూడా అమ్మిస్తే తనకు కమిషన్ వస్తుందని భావించిన ఆ యువకుడు అబ్బాసియా కాలనికి చెందిన వ్యక్తితో కలిసి కిడ్నీ విక్రయ ముఠాలతో సంబంధాలు పెట్టుకుని ఏడాదిన్నరగా కిడ్నీల విక్రయ దందా సాగిస్తున్నారు. ఈ కిడ్నీల అమ్మకం దందాలో ఒక్కో కిడ్నీకి 10నుండి 25లక్షల వరకు అమ్మకానికి పెట్టిన సదరు యువకుడు కిడ్నీ ఇచ్చిన వారికి 5లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుని మిగతా డబ్బుని తానే తీసుకుంటూ కిడ్నీల వ్యాపారం సాగిస్తున్నాడు. కిడ్నీ విక్రయంలో తమకు రావాల్సిన డబ్బులు అందకుండా మోసపోయామని గ్రహించిన 10మందికి పైగా బాధితులు కిడ్నీ దందా యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నల్లగొండ పోలీసులు రహాస్యంగా శాఖాపరమైన దర్యాప్తు సాగిస్తున్నారు.
చత్తీస్‌గఢ్‌లో మావోల భారీ డంప్ స్వాధీనం
చింతూరు, జనవరి 5: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబాద్ జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్‌ను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలావున్నాయి. గరియాబాద్ జిల్లా కార్లజార్ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్ ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో డిస్ట్రిక్ట్ ఫోర్స్ బలగాలు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేపట్టాయి. ఈక్రమంలో మావోయిస్టులకు సంబంధించి 24 టిఫిన్ బాక్స్ బాంబులు, 28 పెట్రోలు బాంబులు పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఇలావుండగా బీజాపూర్ జిల్లా బాసాగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని టర్రెం గ్రామ సమీపంలో కూంబింగ్ చేపడుతున్న సిఆర్‌పిఎఫ్ బలగాలు లక్ష్యంగా మావోయిస్టులు పైపు బాంబు పేల్చారు. ఈ పేలుడులో పోలీస్ బలగాలకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు.

అంధుల క్రికెట్ కెప్టెన్‌గా
అజయ్‌కుమార్‌రెడ్డి
నాగార్జునసాగర్, జనవరి 5: త్వరలో కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో నిర్వహించే 20-20 ఆల్ ఇండియా అంధుల క్రికెట్ మ్యాచ్‌కు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌కు చెందిన అజయ్‌కుమార్‌రెడ్డి కెప్టెన్‌గా నాయకత్వం వహించనున్నారు. నాగార్జునసాగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న అజయ్‌కుమార్ 2013-14 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ప్రపంచ అంధుల క్రికెట్ పోటీలో పాకిస్తాన్‌పై సెంచరీ చేసి భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర వహించాడు. అంధుల ఆసియా క్రికెట్ మ్యాచ్‌లో భారత్‌తోపాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు ఆడనున్నాయి. ప్రస్తుతం కొచ్చిలో నిర్వహించనున్న 20-20 క్రికెట్ మ్యాచ్‌లో 17 మందితో కూడిన జట్టును క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైడ్ ఇన్ ఇండియా నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. జట్టుకు నాయకత్వంగా అజయ్‌కుమార్ ఆడబోతున్నారు. ఈ విషయంలో అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఆసియా కప్ జట్టుకు కెప్టెన్‌గా అవకాశం రావడం తనకెంతో భాద్యత పెంచిందని, ప్రణాళికాబద్ధంగా శిక్షణ తీసుకుని విజయం సాధించేందుకు ప్రణాళికను రూపొందిస్తానని తెలిపారు.

వైభవంగా రెండో రోజు యువజనోత్సవాలు

భద్రాచలం, జనవరి 5: తెలంగాణ రాష్టస్థ్రాయి యువజనోత్సవాలు ఖమ్మం జిల్లా భద్రాచలంలో రెండవరోజు వైభవంగా జరిగాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1000 మంది కళాకారులు ఇందులో పాల్గొన్నారు.
కూచిపూడి, భరతనాట్యం, గీటార్, హిందూస్థాన్ ఓకల్, కర్ణాటక సంగీతం, జానపద గేయాలు, ఏకాంకిక, ఉపన్యాసంపై రెండవరోజు పోటీలు జరిగాయి. యువ కళాకారులు తమ ప్రతిభను నిరూపించేందుకు ఈ పోటీల్లో విశేషంగా రాణిస్తున్నారు. రాష్టస్థ్రాయి పోటీల్లో విజేతలను ఈనెల 12న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయపూర్‌లో జరిగే జాతీయస్థాయి యువజనోత్సవాల(స్వామి వివేకనందా)కు పంపనున్నారు. నేడు ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర యువజన వ్యవహారాల శాఖ అధికారులు తెలిపారు.