తెలంగాణ

జెఎన్‌టియులో మెగా జాబ్ మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ ప్రభుత్వ ఉపాధి శాఖ, భారత పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూకట్‌పల్లి జెఎన్‌టియు ప్రాంగణంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 50 నుంచి 60 వరకు వివిధ కంపెనీలు పాల్గొంటాయి. పట్ట్భద్రులు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్, ఐటి, హోటల్ మేనేజ్‌మెంట్, నర్సింగ్, సేల్స్, మార్కెటింగ్, టెలీకాలర్స్, సెక్యూరిటీ గార్డ్స్, హౌస్ కీపింగ్, డెలివరీ బాయ్స్, ఐటిఐ సాంకేతిక నిపుణల వంటి వివిధ స్థాయిల్లో 7000 ఖాళీలను ఎంపిక చేయడానికి జాబ్ మేళా నిర్వహిస్తారు. హెచ్‌ఎండిఏ పరిధిలోని ఆసక్తిగల అభ్యర్థులు తమ అర్హతల సర్ట్ఫికెట్లతో హాజరు కావాలని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తీతీతీ.ౄషష.షళశఆళ.ష్యౄ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చునని ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కెవై నాయక్ తెలిపారు.