ఆంధ్రప్రదేశ్‌

దొరికిన లీకువీరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ ఎమ్సెట్-2 లీకేజి కేసులో సూత్రధారిగా భావిస్తున్న షేక్ రమేష్ అనే వ్యక్తిని సిఐడి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కర్నూలులోని ఒక హోటల్ వద్ద తరుణ్‌రాజ్, వెంకటేష్‌లను తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. వీరిని హైదరాబాద్‌కు తరలించారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే అరెస్టయిన విష్ణు, తిరుమల్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, చంచల్‌గూడ జైలుకు జ్యుడీషియల్ రిమాండ్‌పై తరలించారు. ఈ కేసులో దాదాపు 130 మంది విద్యార్ధులకు ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రాన్ని బ్రోకర్లు అందించినట్లు సిఐడి పోలీసులకు ఆధారాలు లభించాయి. కాగా పోలీసులు శుక్రవారం బోడుప్పల్‌లో షేక్ రమేష్ అలియాస్ రహీం (52)ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన షేక్ రమేష్ బోడుప్పల్‌లో 20 సంవత్సరాల క్రితమ స్ధిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. ప్రధాన సూత్రధారిగా ఉన్న రాజ్‌గోపాల్‌కు సహాయకుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న రమేష్ 14 మంది విద్యార్ధులను వివిధ నగరాలకు తీసుకెళ్లాడు. విద్యార్ధులకు ఐదు నగరాల క్యాంపుల్లో సుశిక్షితులైన అధ్యాపకులచేత రెండు సెట్లలోని ప్రశ్నాపత్రాల్లో 320 ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంపై శిక్షణ ఇప్పించాడు. విద్యార్ధుల నుంచి రూ.1.73 కోట్ల సొమ్మును వసూలు చేసినట్లు రమేష్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇందులో రూ. 1.2 కోట్ల నగదును మరో బ్రోకర్‌కు రమేష్ చెల్లించాడని సిఐడి అదనపు డిజి సత్యనారాయణ తెలిపాడు. రమేష్ నుంచి రూ. 37.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో రూ. 15 లక్షల నగదును రమేష్ తన స్నేహితుడికి అకౌంట్ ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఎమ్సెట్-2 లీకేజిలో కీలక సూత్రధారులను అరెస్టు చేసేందుకు సిఐడి ఆధ్వర్యంలో తొమ్మిది పోలీసుబృందాలు కర్నాటక, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ రాష్ట్రాల్లో గాలింపు చర్యలను చేపట్టాయి.
తల్లితండ్రులకు నోటీసులు
ఈ కేసులో తప్పుడు పద్ధతుల ద్వారా తమ పిల్లల చేత ఎమ్సెట్-2 పరీక్షలు రాయించిన తల్లితండ్రులకు నోటీసులు ఇవ్వాలని సిఐడి నిర్ణయించింది. ఇంతవరకు దాదాపు 20 మంది తల్లితండ్రులు సిఐడి ఎదుట హాజరై తమకు తెలిసిన విషయాలు చెప్పినట్లు సమాచారం. మొత్తం 74 మంది తల్లితండ్రులు ఎమ్సెట్-2 లీకేజి ప్రలోభాలకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. తాము పిలిచిన హాజరు కాని తల్లితండ్రులకు సిఆర్‌పిసి 41 సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని సిఐడి యోచిస్తోంది. అలాగే బ్రోకర్ల వలలో చిక్కుకుని తల్లితండ్రుల మాట విని వివిధ నగరాల్లో నిర్వహించిన లీకేజి క్యాంపులకు హాజరైన కొంత మంది విద్యార్ధులను కూడా పోలీసులు ప్రశ్నించారు తొలుత విద్యార్ధులు తమకేమీ తెలియదని చెప్పినా, చివరకు విమానపు టిక్కెట్లు, ఎయిర్‌పోర్టులో వీడియో ఫుటేజిలు చూపించిన వెంటనే వారు మొత్తం వివరాలను పూసగుచ్చినట్లు చెప్పినట్లు సమాచారం.
ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు భావిస్తున్న రాజగోపాల్, తదితరులను విద్యార్ధులకు చూపించగా గుర్తుపట్టినట్లు తెలిసింది. విద్యార్ధుల్లో కొంత మంది వయస్సు 18 సంవత్సరాల లోపు ఉంది. వీరు జువెనల్ చట్టాల పరిధిలోకి వస్తారు. వీరి విషయంలో కేసులు నమోదు చేసే విషయమై సిఐడి పోలీసులు న్యాయ శాఖను సంప్రదించారు. ముందుగా ప్రధాన సూత్రధారులను అరెస్టుచేసిన తర్వాత విద్యార్ధుల విషయమై కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు. జెఎన్‌టియుహెచ్ ఈ పరీక్షను నిర్వహించినందు వల్ల కన్వీనర్ కార్యాలయంతో ప్రతి నిత్యం ఉత్తర ప్రత్యుత్తరాల జరిపే కొంత మంది ఉద్యోగుల వ్యవహారశైలిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు.

చిత్రం... సచివాలయం వద్ద ఆందోళనకు దిగిన ఎమ్సెట్ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు