తెలంగాణ

రెండోరోజూ సాగిన సిఐడి దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 29: ఎంసెట్ లీకేజీపై ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం కూడా సిఐడి దర్యాప్తు కొనసాగింది. సిఐడి సిఐ నరేష్ కుమార్ అధ్వర్యంలో పోలీసులు కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన సాయి నిహార్ అనే అభ్యర్థిని విచారించేందుకు గురువారం పోలీసులు వారి ఇంటికి రాగా ఇంటికి తాళం ఉండడంతో శుక్రవారం మరోమారు వారి ఇంటికి వెళ్లగా అభ్యర్థి తల్లిదండ్రులు, అభ్యర్థి సైతం సిఐడి పోలీసులకు వివరాలు వెల్లడించారు. ఎంసెట్-1 పరీక్షలో 56వేల పైచిలుకు ర్యాంకు సాధించిన సాయి నిహార్‌కు ఎంసెట్-2లో 6400 పైచిలుకు ర్యాంకు రావడంతో సిఐడి అడిషనల్ డిజి సత్యనారాయణ అందించిన జాబితా ప్రకారం లోతుగా దర్యాప్తు సాగించారు. పేపర్ లీకేజీతో తనకెలాంటి సంబంధంలేదని, కష్టపడి చదవడంవల్లే రెండోపేపర్‌లో ర్యాంకు వచ్చిందని అభ్యర్థి నిహార్ వివరించాడు. తల్లిదండ్రులు సైతం తమ వాంగ్మూలాన్ని పోలీసులకు అందించారు. జిల్లాలో నలుగురు అనుమానితులుగా గుర్తించిన సిఐడి పోలీసులు ఇచ్చిన జాబితా ప్రకారమే తొలివిడతగా రెండు రోజులు దర్యాప్తు సాగించామని, మరోసారి దర్యాప్తు కొనసాగిస్తామని సిఐడి సిఐ నరేష్ కుమార్ ఆంధ్రభూమికి వివరించారు. ఎంసెట్ ప్రశ్నపత్రం బహిర్గతం వ్యవహరంలో జిల్లాలోని గుడిహత్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాల కేంద్రాల్లో అభ్యర్థులతో లీకేజీ సూత్రదారుల ప్రమేయం ఉందన్న అనుమానంతోనే విచారణ సాగిస్తున్నామని, వారి వివరాలను సేకరించి సిఐడి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ బిజెవైఎం, ఏబివిపి అధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి.