తెలంగాణ

పరకాల, భూపాలపల్లిలో తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 29: ఎంసెట్-2 లీక్‌పై దర్యాప్తు వేగం పుంజుకుంది. రెండు రోజులుగా సిఐడి పోలీసుల బృందం వరంగల్‌లో తనిఖీలు నిర్వహిస్తోంది. జిల్లాలోని పరకాల, భూపాలపల్లిలో ఎంసెట్-2లో అత్యధిక ర్యాంకులు సాధించిన 11 మంది విద్యార్థులను సిఐడి పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఆ విద్యార్థులు చదివిన విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్‌లలో వివరాలు సేకరించినట్లు సమాచారం. ఎంసెట్-2 లీక్‌ను బయటపెట్టిన వ్యక్తి భూపాలపల్లికి చెందిన గిరి రవి కావడంతో ప్రత్యేకంగా సిఐడి పోలీసులు భూపాలపల్లి, పరకాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎంసెట్-1లో వారికి వచ్చిన ర్యాంకులను, ఎంసెట్-2లో వచ్చిన ర్యాంకులను పరిగణనలోకి తీసుకుంటూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎంసెట్-1లో 30వేల పైచిలుకు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎంసెట్-2లో వెయ్యి లోపే ర్యాంకులు రావడంతో లీకు వ్యవహారం బయటపడింది.

వరంగల్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న విద్యార్థులు