తెలంగాణ

భద్రాచలంలో అంత్య పుష్కర శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూలై 31: గోదావరి నది అంత్య పుష్కరాల సందర్భంగా భద్రాచలం పవిత్ర గోదావరిలో భక్తులు భారీ ఎత్తున పుణ్యస్నానాలు చేశారని ఐటీడీఏ పీవో, ఇంఛార్జ్ సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరి ఒడ్డున స్నానఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన గోదావరి నదీ అంత్య పుష్కర పర్వాన్ని ఎమ్మెల్యే సున్నం రాజయ్య, హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్, జిల్లా జడ్జి విజయ్‌మోహన్, భద్రాచలం జడ్జి బుల్లికృష్ణ, దేవస్థానం ఈవో టి.రమేష్‌బాబులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 రోజుల్లో ఒక్కరోజైనా పుణ్యస్నానం ఆచరించాలన్నారు. అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానఘాట్ల వద్దనే స్నానమాచరించాలని అన్నారు. గోదావరి ప్రవాహానికి అనుగుణంగా బారికేడ్లను నిర్మించినట్లు తెలిపారు. నీటి పారుదల శాఖ, అగ్నిమాపక శాఖ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ప్రమాదకర హెచ్చరికలు తెలియజేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. భక్తులు అధ్యాత్మిక భావంతో ప్రశాంతంగా గోదావరి అంత్య పుష్కారాల్లో స్నానమాచరించి శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకోవాలని పేర్కొన్నారు. అంతకుముందు సంకల్పంతో పాటు నదీ పూజ, చక్రపేరుళ్ళకు, శ్రీ పాదులకు, శ్రీరామానుజా సహస్రాబ్ది ఉత్సవంలో భాగంగా మాస నక్షత్రాన్ని పురష్కరించుకుని అభిషేకాలు నిర్వహించి సామూహికంగా పుష్కరస్నానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ భాస్కరన్, తహసిల్దార్ రామకృష్ణ, సర్పంచి శే్వత, దేవస్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్, ప్రధాన అర్చకులు జగన్నాథచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.