తెలంగాణ

ఎంసెట్‌ను రాజకీయం చేయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీని విపక్షాలు రాజకీయం చేయడం తగదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకయిందనే విషయం తెలిసిన తరువాత ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుందని చెప్పారు. తిరిగి పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది అయినా, తిరిగి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని చెప్పారు. గతంలో వివిధ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారే ఈ పనికి పూనుకున్నారని, గతంలో కఠినంగా శిక్షించి ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు. పరీక్ష పత్రాల ముద్రణ తప్ప ఇన్ఫోటెక్ సంస్థకు పరీక్షల నిర్వాహణతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. 2012 నుంచి ఈ సంస్థకే ఇస్తున్నారని, కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులను అయోమయానికి గురి చేసే విధంగా విపక్షాలు వ్యవహరించడం తగదని హితవు పలికారు. లీకేజీ కేసులో నిందితులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. లీకేజీని దాచిపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించలేదని, నిందితులను కఠినంగా శిక్షించాలనే నిర్ణయించుకున్నట్టు పల్లారాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజ బోనాల సందర్భంగా
ఆదివారం అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు