తెలంగాణ
కృష్ణానదికి కార్తీక పౌర్ణమి శోభ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మహబూబ్‌నగర్, నవంబర్ 25: కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన పౌర్ణమిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణానదికి బుధవారం భక్తులు పోటెత్తారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కార్తీక దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. కృష్ణానదీ తీరాన ఉన్న బీచుపల్లి దేవాలయానికి భక్తుల తాకిడి నెలకొంది. శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయాల్లో భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలాఉండగా తుంగభద్ర నదికి కూడా భక్తుల తాకిడి ఎక్కువైంది. అందులో భాగంగా తుంగభద్ర నది తీరాన వెలసిన దక్షిణ కాశీగా పేరొందిన ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు జోగులాంబ దేవాలయంలో కార్తీక దీపాలను వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు. జోగులాంబదేవి దర్శనానికి పలు రాష్ట్రాల నుండి భక్తు లు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. బీచుపల్లి దగ్గర కృష్ణానదికి భక్తుల తాకిడి అధికం కావడంతో పోలీసు లు ముందస్తు చర్యలు తీసుకున్నారు. తెల్లవారుజాము నుండే కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి వేడుకల్లో పాల్గొన్నా రు. అంతేకాకుండా శ్రీశైలం ఉత్తర ద్వారం నల్లమల అటవీ ప్రాంతంలోని ఉమామహేశ్వరం శివాలయానికి భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో నల్లమల అటవీ ప్రాంతం మార్మోగింది. నల్లమల కొండలపై నుండి జాలువారుతున్న జలపాతాల వద్ద, పాపనాశనం దగ్గర భక్తులు పుణ్యస్నానాలు చేసి శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా
చేయించి మీ మచ్చను తొలగించుకోండి
కెసిఆర్‌కు షబ్బీర్ అలీ సూచన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 25: ‘్ఫరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిం చి ఎన్నికల్లో గెలిపించుకుని, మీపై ఉన్న మచ్చను తొలగించుకోండి’ అని కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ శాసనమండలి (కౌ న్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సూచించారు. అలా చేస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మంచి సంప్రదాయాలు పాటించారన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. వరంగల్ ఉప ఎన్నికతో టిఆర్‌ఎస్ హుషారుగా ఉంథి కాబట్టి కాంగ్రెస్, టిడిపి, వైకాపా, బిఎస్‌పిలకు చెందిన 13 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. కిరాయి బలం ఎందుకు? అని ఆయన కెసిఆర్‌నుద్దేశించి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 231 కరవు మండలాలను ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలోని 11 యూనివర్సిటీలకు వైస్‌చాన్సలర్ల నియామకానికి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తే పొగుడుతాం, చెడు చేస్తే విమర్శిస్తామని షబ్బీర్ అలీ తెలిపారు.
కాల్వలో పడి
ఇద్దరి మృతి
కార్తీక పుణ్యస్నానాల్లో విషాదం
మృతుల్లో కొత్త పెళ్లికొడుకు
మునగాల,నవంబర్ 25: కార్తీక పుణ్యస్నానానికి వ చ్చి ప్రమాదవశాత్తు ఇద్ద రు వ్యక్తులు కాల్వలో పడి మృ తి చెందారు. ఈ విషా దకర సంఘటన బుధవా రం తెల్లవారుజామున న ల్గొండ జిల్లా మునగాల మండల కేంద్రంలోని సాగ ర్ హెడ్ రెగ్యులేటర్ వద్ద జరిగింది. మృతుల బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట పట్టణానికి చెందిన కనపర్తి మహేష్ (50) అతని మేనల్లుడు మేగరాజు ప్రశాంత్ (27) తమ బంధువులతో కలిసి కార్తీకపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పుణ్యస్నానాన్ని ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు కాలువలో నీట మునిగి ప్రవాహంలో కొట్టుకొని పోతుండగా బంధువులు భయంతో కేకలు వేయడంతో స్నానం ఆచరిస్తున్న కొంతమంది స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. వారిలో ప్రశాంత్‌ను చేజిక్కించుకొని ఒడ్డుకు తీసుకువచ్చారు. కొనఊపిరితో ఉన్న ప్రశాంత్‌ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కోదాడకు తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుని మేనమామ మహేష్ మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, మృతుడు ప్రశాంత్ ఆస్ట్రేలియాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన వివాహ నిమిత్తం ఇటీవల సూర్యాపేట వచ్చాడు. ఈనెల 19వ తేదీన వివాహం జరిగిన ప్రశాంత్ వారం రోజులకే మృతి చెందడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. మహేష్ కుమారుడు సాయినితీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గడ్డం నగేష్ విలేఖరులకు తెలిపారు.
ఇద్దరు రైతుల ఆత్మహత్య
గుండెపోటుతో మరో ఇద్దరు మృతి
మహబూబ్‌నగర్/మెదక్/ఆదిలాబాద్/వరంగల్ నవంబర్ 25: మెదక్ జిల్లా మెదక్ రూరల్ మండలంలోని సర్దన గ్రామానికి చెందిన శాతం బాలయ్య (52) అనే రైతు అప్పుల బాధతో మంగళవారం రాత్రి పొలం వద్ద పురుగుల మందు సేవించి అపస్మారకస్థితిలో పడిఉండగా గమనించి మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలంలోని తురాటి గ్రామానికి చెందిన కండెల నర్సయ్య (60) అనే రైతు అప్పుల బాధ భరించలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలోని దర్థెపల్లి గ్రామ శివారు గూడోల్లగూడెం ప్రాంతానికి చెందిన గూడ ప్రభాకర్ (38) అప్పుల బాధ తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికిచెందిన కోస్గి నారాయణరెడ్డి (60) అనే కౌలురైతు గుండెపోటుకు గురై మంగళవారం రాత్రి మృతి చెందాడు. అదే గ్రామంలోని కృష్ణమూర్తికి చెందిన 7 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని కందిపంట వేశాడు. తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో పంటలకు తెచ్చిన అప్పులు భారమవడంతో మనస్తాపానికి గురై ఆ పొలంలోనే మృతి చెందాడు.