తెలంగాణ

కమాను.. కుప్పకూలింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, కెపిహెచ్‌బి కాలనీ, ఆగస్టు 2: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి నిర్మాణంలోవున్న కమాన్ (ఆర్చ్ గేట్) కుప్పకూలింది. ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల ఫిలింనగర్, చిలకలగూడలో కూలిన నిర్మాణాల ఘటన మరువక ముందే తాజాగా మంగళవారం కూకట్‌పల్లిలో జరిగిన మరో దుర్ఘటన స్థానికులను కలచివేసింది. వసంత్‌నగర్ సిబిసిఐడి కాలనీలో నిర్మాణంలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ కమాన్ ఒక్కసారిగా కుప్పకూలడంతో శ్రీకాకుళానికి చెందిన కూలీలు ధర్మారావు(30) నాగభూషణం (50) ఒడిశాకు చెందిన జనార్ధన్ (40)లు శిథిలాల కింద పడి మృతి చెందారు. క్షతగాత్రులు నలుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు సంఘటన ప్రాంతంలో న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. కుటుంబ సభ్యులు రాకముందే అపార్ట్‌మెంట్ యజమానులు మృతదేహాన్ని అక్కడినుంచి తరలించడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాణ్యత లోపంతో పనులు చేపట్టిన నిర్వాహకులపై చట్టపరంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం చేయించాలని కోరారు. సమాచారం తెలిసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ నవీన్‌చంద్, మాదాపూర్ డిసిపి కార్తికేయ, కూకట్‌పల్లి ఏసిపి భుజంగరావు, సిఐ కుషాల్కర్, డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్, ఎమ్మెల్యే కృష్ణారావు, జిహెచ్‌ఎమ్‌సి జోనల్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి, కూకట్‌పల్లి-14ఎ, 14బి కమిషనర్లు నరేందర్‌గౌడ్, రవీందర్‌కుమార్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబీకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్తగా నిర్మిస్తున్న మెడోల్యాండ్ అపార్ట్‌మెంట్ ముందు కమాన్ నిర్మాణం చేపట్టారు. అయితే మంగళవారం కమాన్ నిర్మాణం చేస్తున్న 10మంది కూలీల్లో ఐదుగురు కమాన్ పైన ఉండి పనులు చేస్తుండగా నాణ్యత లోపించిన సెంట్రింగ్ నిర్మాణం ఒక్కసారిగా కూలిపోవడంతో నిర్మాణం కింద పనిచేస్తున్న ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిలో బీహార్‌కు చెందిన యాదయ్య, శ్రీకాకుళానికి చెందిన తిరుపతిరావు, రమణలతో పాటు ఒంగోలుకు చెందిన అనిల్ ఉన్నారు. అపార్ట్‌మెంట్ నిర్మాణం జరుగుతున్న స్థలం వివాదస్పదమైందని, అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారంటూ ఆరోపించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ నవీన్‌చంద్ మాట్లాడుతూ నిర్మాణంలో జరిగిన లోపాలతోపాటు సంఘటనకు బాధ్యులైన అపార్ట్‌మెంట్ యజమానులను విచారించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. 2014లో మెడోల్యాండ్ అపార్ట్‌మెంట్‌కు అనుమతిరాగా కమాన్‌కు మాత్రం అనుమతి లేదని తెలిపారు. ఘటనలో మృతి చెందిన వారికి జిహెచ్‌ఎమ్‌సి తరపున రూ.50వేల ఆర్ధిక సహాయాన్ని అందచేయనున్నట్టు వారు తెలిపారు.

చిత్రం... సంఘటనా ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సిపి నవీన్‌చంద్, డిసిపి కార్తికేయ