తెలంగాణ

ఒకేఒక్కడు వెంకటయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: ఈ నగరానికి ఏమైంది. రికార్డుల్లో దూసుకుపోతోంది. కండల వీరుడు రోహిత్ ఖండేల్వాల్ మిస్టర్ వరల్డ్‌గా ఎంపికైతే, పారిశుద్ధ్య కార్మికుడు టి వెంకటయ్య ఒకే ఒక్కడిగా నిలిచాడు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు వారధిగా నిలిచి, జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడు పురస్కారానికి ఎంపికయ్యాడు. కేంద్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఎంపిక చేసిన ఇద్దరు ఉత్తమ కార్మికుల్లో వెంకటయ్య ఉండటం విశేషం. ఈయన ఈనెల 6న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘ఉత్తమ పారిశుద్ద్య కార్మికుడు’ అవార్డు స్వీకరించనున్నట్టు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. రాజేంద్రనగర్ సర్కిల్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న వెంకటయ్య తమ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్, రాఘవేంద్రకాలనీల్లో పారిశుద్ధ్య పనులు చేస్తుంటారు. విధుల్లో ఆయన చూపుతున్న నిబద్దత, సమయపాలన, డ్రెయినేజీ సమస్యల పరిష్కారం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని వెంకటయ్య పేరును ఖరారు చేసినట్టు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి కేంద్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. దేశంలోని వివిధ మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర మున్సిపల్ మంత్రిత్వ శాఖ వెంకటయ్యను ఉత్తమ కార్మికుడిగా ఎంపిక చేసింది. వెంకటయ్యతోపాటు కోయంబత్తూర్ కార్పొరేషన్‌కు చెందిన మరో కార్మికుడు ఈఏటి ఉత్తమ కార్మికులుగా ఎంపికయ్యారు. వెంకటయ్య ప్రతిరోజూ విధులకు తెల్లవారుఝను ఐదున్నరకే హజరవుతాడు. ఇప్పటి వరకు ఆయన ఎలాంటి సెలవులూ వాడుకోలేదు. విధి నిర్వహణలో ఎప్పుడూ అలక్ష్యం చూపలేదని అధికారులు తెలిపారు. వెంకటయ్య పనిచేస్తున్న బాబుల్‌రెడ్డి నగర్‌ను చెత్త కుండీల్లేని వాడగా ఏర్పాటు చేయటంతోపాటు, వంద శాతం ఇళ్లనుంచి చెత్తను సేకరిస్తుంటాడని తెలిపారు. ఎయిర్‌టెక్ మిషన్లు లేకున్నా డ్రెయినేజీ సమస్యలను పరిష్కరించటంలో కీలక పాత్ర పోషించిన వెంకటయ్య, ఈ నెల 6న న్యూఢిల్లీలో ప్రారంభించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించనున్నట్టు తెలిపారు. ఈమేరకు వెంకటయ్యను మంగళవారం మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సౌత్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.