తెలంగాణ

గిరిజన ప్రాంతాల్లో 125 ఉపకేంద్ర భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: మూడు తెలంగాణ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో 125 ఆరోగ్య ఉపకేంద్రాలకు భవనాలను నిర్మించేందుకు అవసరమైన నిధులను కేంద్రం విడుదల చేసింది. వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను మంగళవారం ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు వౌలిక సదుపాయాలు కల్పించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నిధులను ఇస్తూ వస్తోంది. ఇందులో భాగంగా 2015-16 సంవత్సరంలోనే తెలంగాణకు 17.50 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనాపరమైన మంజూరు ఇవ్వడంలో జాప్యం చేసింది. తాజాగా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 125 గిరిజన ప్రాంతాలను గుర్తించి అక్కడ వైద్య ఉపకేంద్రాలను నిర్మించేందుకు అనుమతించింది. కేంద్రం గత ఏడాది ఇచ్చిన నిధులను ఈ ఏడాది వాడుకుంటున్నారు. వాస్తవంగా అయితే ఒక ఏడాది మంజూరు చేసిన నిధులు మరుసటి ఏడాదికి మురిగిపోతాయి. కానీ జాతీయ ఆరోగ్య మిషన్ కింద నిధులను కేటాయించడంతో వీటిని ఈ సంవత్సరం వాడుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఈ మిషన్ కింద విడుదయ్యే నిధులు మురిగిపోవని సంబంధిత అధికారులు వెల్లడించారు.