తెలంగాణ

విష జ్వరాలపై అప్రమత్తం గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: గిరిజన తండాలు, గూడెంలలో వైద్య సేవలను మరింతగా విస్తృత పరచాలని గిరిజనాభివృద్ధి, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం తన చాంబర్‌లో అధికారులతో వైద్య సహాయంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో మలేరియా, ఇతర విష జ్వరాలు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సీజన్‌లో గిరిజనులకు వైద్య పరమైన సేవలను అందించేందుకు ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా సమీప ప్రైవేటు ఆస్పత్రులతో కూడా ప్రత్యేకంగా క్యాంపులను నిర్వహించాలని ఆదేశించారు. గతంలోని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక ఆస్పత్రుల్లో ముందస్తుగా మందులను ఆందుబాటులో ఉంచాలని అన్ని స్థాయిల్లోని సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ప్రతి మండలానికి ఇన్‌చార్జ్ అధికారులను నియమించి, గిరి పుత్రులకు సకాలంలో వైద్య సదుపాయాలను అందించాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో 104 సేవలను విస్తరించాలని, నిపుణుల కొరత ఉంటే ఇతర ప్రాంతాల నుంచి డాక్టర్లను డిప్యుటేషన్‌పై పంపాలని చెప్పారు. విద్యార్థులకు ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ లక్ష్మణ్, గిరిజన సాంస్కృతిక పరిశోధన సంస్థ డైరెక్టర్ నికోలస్ పాల్గొన్నారు.

ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లకు ఓకె

హైదరాబాద్, ఆగస్టు 2: తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్టవ్య్రాప్తంగా 12,638 ఖాళీలున్నట్టు సాంకేతిక విద్యా కమిషనర్ డాక్టర్ ఎం వి రెడ్డి చెప్పారు. కాలేజీల్లో బ్రాంచిల స్లయిడింగ్‌ను ఈ నెల 6వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని, మిగిలిన సీట్లకు నోటిఫికేషన్లు జారీ చేసి ఆగస్టు 8 నుండి 13వ తేదీలోగా భర్తీచేయాలని అన్నారు. అనంతరం 16వ తేదీలోగా డాటా అప్‌లోడ్ చేయాలని, సాంకేతిక విద్యాభవన్‌లో పూర్తి వివరాలను కాలేజీల యాజమాన్యాలు ఈ నెల 20వ తేదీలోగా అందించాలని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా బైపిసి తుది దశ అడ్మిషన్ల కౌనె్సలింగ్ నోటిఫికేషన్‌ను మంగళవారం నాడు జారీ చేశారు.

మంత్రులను బర్త్ఫ్ చేయాలని ఏబివిపి దీక్ష

హైదరాబాద్, ఆగస్టు 2: ఎమ్సెట్ -2 పేపర్ లీక్ కుంభకోణానికి బాధ్యులైన మంత్రులను ముఖ్యమంత్రి బర్త్ఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ కార్యకర్తలు ఉస్మానియా యూనివర్శిటీలో, జెఎన్‌టియులో రిలేనిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్సెట్ రద్దును వ్యతిరేకిస్తూ జెఎన్‌టియులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉన్నత విద్యామండలిలో చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డిని అడ్డుకుని ఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎబివిపి కార్యకర్తలను అరెస్టు చేశారు. ఒయులో రిలే నిరాహార దీక్షలను ఎబివిపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం చెన్న కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పరీక్షా ప్రశ్నాపత్రాలు లీకేజీ సందర్భంగా ఆ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ మంత్రులు రాజీనామా చేశారని గుర్తు చేశారు. రిలే నిరాహార దీక్షకు ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ మద్దతు పలికారు. జెఎన్‌టియులో జరిగిన రిలేనిరాహార దీక్షను రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప ప్రారంభించారు.