తెలంగాణ

పిఎస్‌యూల విభజన జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్/హైదరాబాద్, ఆగస్టు 2: ప్రభుత్వ రంగ సంస్థల విభజన సంపూర్ణంగా జరగాలని తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల మనుగడతోనే కులవృత్తులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిలకడ సాధ్యమని తేల్చి చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లారుూస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం లక్డీకాపూల్‌లోని హోటల్ సెంట్రల్‌కోర్ట్‌లో ‘ప్రమాదంలో ప్రభుత్వ రంగ సంస్థలు’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.సుధీర్ బాబు, చైర్మన్ ఎస్.విజయమోహన్, సెక్రటరీ జనరల్ బి.రాజేశం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వక్తలుగాప్రొ.కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, ప్రొ.జి.హరగోపాల్, మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కె.నాగేశ్వర్ హాజరై ప్రసంగించారు. కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఉద్యోగులు, సంస్థల పంపిణీ పూర్తికాకపోవటం శోచనీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలంగాణ ఉద్యోగులను నేటికీ రిలీవ్ చేయలేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల విభజన కేవలం కాగితాలకే పరిమితమయ్యిందని విమర్శించారు. అసలే విభజన జరగటం లేదంటే ఉన్నవాటిని కూడా మూసివేయించి, ఉద్యోగులను డిప్యుటేషన్‌పై ఇతర శాఖలకు కేటాయించటం దుర్మార్గమని అన్నారు. ఓవైపు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కడుతామంటూనే హౌసింగ్ బోర్డును మూసివేయటం తగదని చెప్పారు. ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక విధానం, ఆర్థిక నమూనాను విస్మరించిందని, అందుకే ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రజలు తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ ఎజెండానే తప్పుడు విధానమనీ, దోచుకుని దాచుకునేందుకే బంగారు తెలంగాణ అని దుయ్యబట్టారు. సమష్టి పోరాటాలతోనే ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రొ.పురుషోత్తం, తెలంగాణ జెఎసి సమన్వయకర్త పిట్టల రవీందర్, పత్రికా సంపాదకుడు ఎస్.వీరయ్య, ఎన్.వేణుగోపాల్, టిజెఎసి కోకన్వీనర్ కె.రఘు పాల్గొన్నారు.

‘ప్రమాదంలోప్రభుత్వరంగ సంస్థలు’ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రొ.కోదండరాం