తెలంగాణ

కోట్లు స్వాహా చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: తెలంగాణకు కాంగ్రెస్ నాయకులు చేసింది ఏమీ లేదని, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో కోట్లు స్వాహా చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ బోడకుంట వెంకటేశ్వర్లు, రాములు నాయక్, మాజీ ఎమ్మెల్సీ కావేటి సమ్మయ్యలతో కలిసి మంగళవారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత రెండేళ్లలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకుల విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ వైపు కనె్నత్తి చూడని జైపాల్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జైపాల్‌రెడ్డి సొంత జిల్లాకు చేసిందేమీ లేదని, అందుకే జిల్లా ప్రజలు తిరస్కరించారన్నారు. 60 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్, టిడిపిలు కోతలు లేని విద్యుత్ అందించలేకపోయారని, కెసిఆర్ అది సాధించి చూపించారని అన్నారు. లో ఓల్టేజీతో రైతులు గతంలో ఇబ్బందులు పడేవారని, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అలాంటి సమస్యలు లేకుండా పోయాయని, తొమ్మిది గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ అందజేయగలుగుతున్నామని చెప్పారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్, టిడిపిలే నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయించినట్టు చెప్పారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తి పోతల సాధన పేరుతో చేసిన పాదయాత్రల ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా జైపాల్‌రెడ్డి ఇతర నాయకులు తెలంగాణ వ్యతిరేక శక్తులతో కలిసి పోయారని జూపల్లి ఆరోపించారు.
తెలంగాణకు ఒక్క
ప్రాజెక్టయినా తెచ్చారా?
దశాబ్ద కాలం పాటు కేంద్రంలో మంత్రి పదవిలో ఉండి ఎస్ జైపాల్‌రెడ్డి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా తేలేదని టిఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. టిఆర్‌ఎస్ ఎల్‌పిలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీలు భానుప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. పదేళ్లపాటు మంత్రిగా పని చేసి మహబూబ్‌నగర్‌కు ఏం చేశారు, ఒక్కనాడైనా జిల్లా గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. ఎవరు రైతు కంటకులో, కాంట్రాక్టర్ల ప్రియులో ఆరుదశాబ్దాల కాంగ్రెస్ హయాంలో ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. కాంగ్రెస్, టిడిపిలు తెలంగాణను ఎండబెట్టి ఎడారిగా మార్చాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారిపై సిబిఐ కేసుల విచారణ జరుగుతోందని, అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడడం విడ్డూరం అని అన్నారు. తెలంగాణకు ఏ విధంగాను ఉపయోగపడని ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును తెరపైకి తీసుకు వచ్చి హెడ్‌వర్క్స్ చేయకుండానే చేవెళ్ల వద్ద కాలువలు తవ్వి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న నీతిమాలిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. గోదావరి జలాల్లో మనకున్న 1250 టిఎంసిల నీటిని వినియోగించుకుంటూ కోటి ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేసి రైతు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఎన్నికలొచ్చినప్పుడే ప్రాజెక్టుల వద్ద కొబ్బరి కాయలు కొట్టి ఆ తర్వాత తట్టెడు మట్టి కూడా పోయని టిడిపి నేతలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఆనాటి వైఎస్‌ఆర్ ప్రభుత్వ హయాంలో అహంకార పూరితంగా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటిని తరలించుకు పోతుంటే వౌనంగా చూస్తూ ఉన్నారని విమర్శించారు. డికె అరుణ వైఎస్‌ఆర్‌కు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారని గుర్తు చేశారు. అప్పటి నందికొట్కూర్ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆర్‌డిఎస్ తూములను పగుల గొట్టి నీటిని అక్రమంగా తరలించుకు పోతుంటే మాట్లాడని నాగం జనార్దన్‌రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు.