తెలంగాణ

‘లీకేజీ’ మంత్రులను బర్తరఫ్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: ఎంసెట్-2 లీకేజీపై వ్యవహారంలో సంబంధిత మంత్రులను బర్తరఫ్ చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. మంగళవారం టి.పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఎంసెట్ లీకేజీపై, మల్లన్న సాగర్‌లో నిర్భంధంపై వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. లీకేజీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించి, దోషులపై చర్య తీసుకోవాలని వారు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. మరోవైపు నిర్బంధం కొనసాగిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని వారు ఆరోపించారు. సమావేశానంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న పెద్ద హస్తంతోనే ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని విమర్శించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆయన తెలిపారు. భూములు ఇవ్వమని నిరసన తెలిపేందుకు రోడ్డుపైకి వచ్చిన రైతులను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, మహళలను బూట్లతో తన్నారని వారు ఆరోపించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు అరుణ, సంపత్‌కుమార్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు
వినతిపత్రం అందజేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు