తెలంగాణ

కువైట్, సౌదీ సంక్షోభంతో.. వలస కుటుంబాల్లో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఆగస్టు 2: కువైట్, సౌదీ అరబ్ దేశాల్లో నెలకొన్న సంక్షోభం ఇక్కడి వలస జీవితాల్లో ఆందోళన రేకేత్తిస్తుంది. అక్కడి చమురు సంస్థలు నష్టాలను చవి చూస్తున్న క్రమంలో ఉద్యోగులను తొలగిస్తుడడంతో వలస జీవుల కుటుంబాల్లో తీవ్ర అందోళన వ్యక్తం అవుతుంది. గతకొద్ది రోజులుగా చమురు సంస్థలు ఆర్థిక సంక్షోభం ఎదురుకుంటుడంతో కూలీలను యాజమాన్యాలు తొలగింపు నేపంతో విధులకు హజరు కానివ్వకుండా అడ్డుకుంటుండడంతో ఉపాధి కోల్పోతున్నామని కార్మికులు అందోళన చెందుతూ అక్కడే పనులు చేస్తున్న గల్ఫ్ ఉద్యోగుల ద్వారా ఇక్కడికి సమాచారం అందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర అందోళన మొదలైంది. వరస కరువు పరిస్థితుల కారణంగా పొట్ట చేత పట్టుకుని ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టిన కార్మికులకు చమురు కంపనీల సంక్షోభంతో స్వదేశంలో కరువు పరిస్థితి, గల్ఫ్ దేశాల సంక్షోభం వల్ల అప్పులు తీర్చలేక రెంటికి చెడ్డ రేవడిలా తమ బతుకులు మారాయని, ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. జగిత్యాల డివిజన్‌లోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి మండలంతో పాటు కోరుట్ల మండలం, మేడిపల్లి, రాయికల్ తదితర ప్రాంతాలకు చెందిన వందల మంది వలస కుటుంబాలు చేసిన అప్పులు తీర్చడం భారంగా మారాయిని ఆవేదన చెందుతున్నారు. గత రెండు, మూడు రోజులుగా కువైట్, సౌదీలో చమురు సంస్థలు వేతనాలు ఇవ్వక, పనిని సైతం కల్పించకుండా విధులకు రానివ్వకపోవడంతో వలస కుటుంబాలు తీవ్ర అందోళన చెందుతున్నాయి.
బాధిత కుటుంబాలకు సరైన సమాచారం అందక పోవడంతో అక్కడి ఉద్యోగుల ద్వారా అందుతున్న సమాచారంతో అసలు అక్కడ ఏం జరుగుతుందోనని భయాందోళనలకు గురి అవుతున్నారు.