తెలంగాణ

గోదావరి అంత్య పుష్కరాలకు భక్తుల తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/నిజామాబాద్/వరంగల్/ఆదిలాబాద్, ఆగస్టు 2: గోదావరి అంత్య పుష్కరాలలో మూడవ రోజు వివిధ పుష్కరఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం అమావాస్య కావడంతో సెంటిమెంటు గల భక్తులు కరీంనగర్ జిల్లా ధర్మపురిలో నదీ స్నానాల కోసం రాగా, భక్తుల రద్దీ ఉదయం నుండి క్రమేపీ అధికమైంది. రాష్ట్రం నుండేకాక, రాష్ట్రేతర సుదూర ప్రాంతాల నుండి, ప్రయివేటు వాహనాలలో పిల్లాపాపలతో తరలి వచ్చిన భక్త, యాత్రిక జనం గోదావరిలో పుష్కర పవిత్ర స్నానాలను ఆచరించారు. మహిళలు అధిక సంఖ్యలో గోదావరి మాతను పూజించి, ముత్తయిదువులకు వాయనాలను సమర్పించి, దానధర్మాదికాలను నిర్వహించుకున్నారు. కమాన్‌పూర్ మండలం సుందిల్ల గ్రామంలో కొనసాగుతున్న అంత్య పుష్కరాలకు మంగళవారంతోపాటు అమవాస్య కావడంతో భక్తుల రద్దీ చాలావరకు తగ్గిపోయింది. మంగళవారం నామమాత్రంగా భక్తులు గోదావరిఖని, సెంటినరీకాలనీ, కమాన్‌పూర్, యైటింక్లయిన్ కాలనీ, కరీంనగర్, సుల్తానాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చి పుష్కర పుణ్య స్నానాలను ఆచరించారు. అదేవిధంగా వరంగల్ జిల్లా మంగపేట గోదావరి ఫెర్రీ పాయింట్ వద్ద నిర్మించిన పుష్కరఘాట్‌కు మంగళవారం భక్తులు తక్కువ సంఖ్యలో విచ్చేశారు. మంగళవారం, అమావాస్య కావడంతో మంగళవారం, అమావాస్య సెంటిమెంట్ ఉండడంతో పుష్కర స్నానాలకు, పిండప్రదాన కార్యక్రమానికి మంగళవారం భక్తజనం అల్ప సంఖ్యలో హాజరయ్యారు. వచ్చిన కాస్తా భక్తులు కూడా పుష్కరఘాట్ అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై పెదవి విరుస్తున్నారు. నిజామా బాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడ్‌పాకల్ పుష్కర ఘాట్‌లో 3వ రోజు 265 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. ఒకవైపు చిరుజల్లులు కురుస్తుండటంతో పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతోంది. మంగళవారం అమావాస్య కావడంతో ఆదిలా బాద్ జిల్లా బాసర గోదావరి ఘాట్ల వద్ద భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. మహారాష్ట్ర నుండి వచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీతీరాన గల శివాలయంలో ప్రత్యేక అభిషేక, అర్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస మండపాల్లో అక్షరస్వీకార పూజలు నిర్వహింపచేశారు. భక్తుల రద్దీ అంతగా లేకపోవడంతో దర్శన సమయం తక్కువపడుతోంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారి అన్నదాన సత్రంతోపాటు గోదావరి నదీతీరాన గల అన్నపూర్ణమాత ఆలయంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నేటి నుండి శ్రావణమాసం శుభముహుర్తాల నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.