తెలంగాణ

పాలమూరు గోస పట్టించుకున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఆగస్టు 2: కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీషరావు విమర్శించారు. మంగళవారం మెదక్ సాయిబాలాజీ గార్డెన్‌లో జరిగిన మెదక్ నియోజకవర్గ తెరాస కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌లో సోమవారం జరిగిన ఒక సమావేశంలో పిల్లిని చంకన పెట్టుకున్నట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణను జైపాల్‌రెడ్డి పక్కన పెట్టుకోడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మిషన్ కాకతీయ పనులపై రమణ సుప్రీంకోర్టులో కేసులు వేసిన విషయాన్ని హరీష్‌రావు గుర్తు చేశారు. తెలంగాణ నోరు కొట్టే రమణను జైపాల్‌రెడ్డి పక్కన పెట్టుకోవడం సరైన విధానం కాదన్నారు. రాజకీయాలు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా అని ఆయన జైపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. 10 ఏళ్లు కేంద్ర మంత్రిగా వ్యవహరించిన జైపాల్‌రెడ్డ్డి మహబూబ్‌నగర్ నుండి రాయలసీమకు నీళ్లు తరలించుకొని వెళ్తుంటే నోరెత్తలేదని, ఇప్పుడు మాత్రం ఆయనకు నోరు వచ్చిందన్నారు. పులిచింతలకు నీళ్లు తీసుకొని అప్పుడు ప్రశ్నించని ఆయన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్ట్‌లపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కల్వకుర్తి నుండి అక్రమంగా నీళ్లు తరలిస్తుంటే అప్పుడు కనిపించలేదా అని ఆయన జైపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. పాలమూరు ప్రజల గోసను జైపాల్‌రెడ్డి పట్టించుకోలేదన్నారు. జూరాల ప్రాజెక్ట్‌లో నీళ్లు లేవని, కానీ కేవలం 9 టిఎంసిల నీళ్లతో జూరాల కింద 4.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నారన్నారు. ప్రాజెక్ట్‌లపై అవగాహన కల్పించడానికి ఇంజనీర్ల సూచనలు తీసుకోవాలని హరీష్‌రావు సూచించారు.