తెలంగాణ

ఆహార ఉత్పత్తులు సర్కారుకో సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2 : తెలంగాణ రాష్ట్రంలో ఆహార ఉత్పత్తులు 2016-17 సంవత్సరంలో ఎంత వరకు సాధ్యమవుతుందన్న అంశంపై అధ్యయనం జరుగుతోంది. వర్షాలు బాగా ఉంటే సాధారణంగా 80 నుండి 110 లక్షల టన్నుల వరకు ఆహార పంటలు పండుతాయి. గత ఎనిమిది సంవత్సరాల్లో అత్యధికంగా ఉత్పత్తి జరిగి రికార్డు సృష్టించిన సంవత్సరం 2013-14 వ సంవత్సరం. ఆ సంవత్సరం తెలంగాణలో 106.86 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు జరిగా యి. 2016-17 సంవత్సరంలో 100 లక్షల టన్నులపైగానే ఆహార ధాన్యా లు ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించింది. మిష న్ కాకతీయను చేపట్టడం ద్వారా రాష్ట్రంలోని చాలా చెరువులు, కుంటల పునరుద్దరణ జరిగింది. దీని ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందని భావిస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇది సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వ్యవసాయ శాఖ 2016 ఏప్రిల్ 25 నుండి మే ఐదు వరకు చేపట్టిన ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని కమిషనర్ జిడి ప్రియదర్శిని ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు.
ఖరీఫ్-16 సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా 332 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా, 385.80 మి.మీలు నమోదైంది. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువగా వర్షాలు కురిశాయి. మిగతా ఏడు జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది. జూన్ రెండోవారం తర్వాత నైరుతీరుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి, ఆ తర్వాత వారంలోగా అన్ని జిల్లాల్లో రుతుపవనాలు విస్తరించాయి.
రాష్ట్రంలో ఏటాఖరీఫ్‌లో 110 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేస్తుంటారు. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 70 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. వేసిన విత్తనాలు ఇప్పటికి మూరెడు నుండి రెండుమూరల పొడుగు వరకు పెరిగాయి. జలాశయాల్లోకి నీరు ఎక్కువగా చేరకపోవడంతో వరినాట్లు మందకొడిగా సాగుతున్నాయి. నారుమళ్లస్థాయిలో వరి ఉంది. సాధారణంగా 25 లక్షల ఎకరాల్లో వరిసాగవుతుండగా, ఈసీజన్‌లో ఇప్పటి వరకు కేవలం ఐదులక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. వరినాట్లు ఆగస్టు చివరి వరకు కొనసాగుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. జొన్న, సజ్జ, తైదలు, మక్కలు తదితర తృణధాన్యాలు 15 లక్షల ఎకరాల్లో వేశారు. కందులు, జొన్నలు, మక్కలు ఎక్కువ వేయాలని, పత్తిపంట విస్తీర్ణాన్ని తగ్గించాలని ప్రభుత్వ చేసిన ప్రచారానికి స్పందన లభించింది. సాధారణంగా 6.50 లక్షల ఎకరాల్లో కందులు వేస్తుండగా, ఈసీజన్‌లో ఇప్పటివరకు 8.50 లక్షల ఎకరాల్లో వేశారు. మొత్తంమీద పదిలక్షల ఎకరాల్లో పప్పులు వేయా ల్సి ఉండగా, దాదాపు 14 లక్షల ఎకరాల్లో వేశారు. అలాగే నూనె విత్తనా లు ఎనిమిది లక్షల ఎకరాల్లో వేశారు.
పత్తిపై ఫలించిన
సర్కారు వ్యూహం
పత్తిపంట విస్తీర్ణాన్ని ఈ సీజన్‌లో గణనీయంగా తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వ్యూహం ఫలించింది. సాధారణంగా 42-45 లక్షల ఎకరాల్లో పత్తిపంటు వేస్తారు. పత్తిపంట విస్తీర్ణాన్నితగ్గించాలని ప్రభు త్వం విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ ప్రచారానికి మంచి స్పందన రైతుల నుండి వచ్చింది. దాంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 28 లక్షల ఎకరాల్లోనే పత్తివేశారు.