తెలంగాణ

శ్రీరాంసాగర్‌లోకి 69 వేల క్యూసెక్కుల వరదనీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, ఆగస్టు 2: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడ్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుండి 69 వేల క్యూసెక్కుల భారీ వరదనీరు వచ్చి చేరుతోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, నాందేడ్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్టల్రోని విష్ణుపురి, ఆమ్రేడ్ రిజర్వాయర్‌ల మిగులు జలాలు తోడు కావడంతో 69 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఎఇ మహేందర్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం 1077.20 అడుగులు 45.20 టిఎంసిలకు చేరుకుందని, రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 90 టిఎంసిలని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1051.60 అడుగులు 7.07 టిఎంసిల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇదిలాఉండగా, వర్షాకాలం సీజన్ ప్రారంభంలో రిజర్వాయర్‌లో కేవలం 4.50 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉండగా, మంగళవారం సాయంత్రానికి 40 టిఎంసిల వరదనీరు వచ్చి చేరిందన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 45.20 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జిల్లాకు ప్రధాన ఆధారమైన లక్ష్మికాల్వ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.