తెలంగాణ

సాదాబైనామాలకు 12 లక్షల దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 2: సాదాబైనామాల కింద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడానికి రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా, రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
మంగళవారం కరీంనగర్‌లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవె న్యూ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిఓ 58,59 ప్రకారం సాదాబైనామా, విరాసత్, మ్యుటేషన్‌ల దరఖాస్తులను వెంటనే నిబంధనల మేరకు పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రభుత్వ, భూదాన్, వక్ఫ్ బోర్డు భూములను గుర్తించి వెంటనే ఫెన్సింగ్‌తో పాటు బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ శాఖాపరమైన పనులు నిరంతరంగా నిర్వహించాలని, దళారులు, సమస్యలు సృష్టించే వారిపై చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, పలువురు అధికారులు పాల్గొన్నారు.

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ