తెలంగాణ

వీళ్లా.. వీసీలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: దేశంలో ఎన్నడూ ఎక్కడా లేనివిధంగా చరిత్రలోనే మొదటిసారిగా తెలంగాణలో 8మంది వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియను హైకోర్టు కొట్టివేయడం విద్యావేత్తలను ఆశ్చర్యపరిచింది. దూరదృష్టి, అనుభవం, సచ్ఛీలత, పరిశోధన, నైతిక విలువలతో పాటు మేథాపరమైన గుర్తింపు సహా అనేక విద్యాపరమైన విశిష్ట అనుభవాలున్న వారిని మాత్రమే వైస్ ఛాన్సలర్లుగా నియమించాల్సి ఉండగా, ఫిర్యాదులు ఎదుర్కొంటున్న వారిని, కనీసం ఒక్క పిహెచ్‌డి విద్యార్ధికి సైతం గైడ్‌గా వ్యవహరించని వారిని, పరిశోధనలకు ఎన్నడూ మార్గదర్శకం చేయని వారిని, అనుభవం లేనివారిని, సచ్ఛీలత సైతం ప్రశ్నార్ధకమైన వారిని వీసీలుగా నియమించడంపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. తెలంగాణలోని 14 వర్శిటీలకు గత రెండేళ్లుగా ఉపకులపతులు, కార్యనిర్వాహక మండళ్లు లేక పాలన స్తంభించి పరిస్థితులు అస్తవ్యస్థమయ్యాయి. ఇటీవల ప్రభుత్వం 8 వర్శిటీలకు విసిలను నియమించింది. మరో రెండు వర్శిటీలకు సెర్చికమిటీలను నియమించింది. మహాత్మాగాంధీ యూనివర్శిటీకి ప్రొఫెసర్ ఖాజా అల్త్ఫా హుస్సేన్, జెఎన్‌టియుకు ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీకి ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్శిటీకి ప్రొఫెసర్ పి సాంబయ్య, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్శిటీకి ప్రొఫెసర్ కె సీతారామారావును, ఉస్మానియా యూనివర్శిటీకి ప్రొఫెసర్ ఎస్ రామచంద్రంను, కాకతీయ వర్శిటీకి ప్రొఫెసర్ ఆర్ సాయన్నను, పాలమూరు వర్శిటీకి ప్రొఫెసర్ బి రాజరత్నంను నియమించారు.
జెఎన్‌టియు ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీకి, ఆర్‌జియుకెటి విసిల పదవులకు సెర్చికమిటీలను నియమించారు. వీరిలో కొందరిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా, ప్రభుత్వం వెనుకాడకుండా వీసీలుగా నియమించడం వివాదాస్పదమవుతోంది. ఇంటిలిజెన్స్ సైతం కొంతమంది వ్యవహారాల శైలిని తప్పుపట్టింది. వారి నియామకాలపై ‘నెగిటివ్’ నివేదిక ఇచ్చినా సిఎం సానుకూల నిర్ణయం తీసుకోవడంపై విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైస్ చాన్సలర్ల నియమకానికి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదం కాగా, వీసీల నియామకానికి అనుసరించిన విధానం మరింత ఆజ్యం పోసింది. సీనియారిటీని ఉల్లంఘించడం ఇందులో ప్రధాన ఆరోపణ కాగా, కనీస అర్హతలు లేనివారిని సైతం నియమించడం ద్వారా ప్రమాణాలకు నీళ్లు వదిలిందనే ఆరోపణలకు ఊతం కల్పించింది. ప్రభుత్వం తీరుపై కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్థానం సైతం పలుమార్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సైతం ప్రభుత్వం పరిగణించకపోవడంతో వీసీల నియామక ప్రక్రియ అనేక సందేహాలకు కారణమైంది. ఈ క్రమంలో హైకోర్టు సైతం వీసీల నియామకాలను సాంకేతిక కారణాలతో రద్దు చేయడంతో పాటు నాలుగు వారాల వ్యవధిని ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ నాలుగు వారాల వ్యవధిలో కొత్త వీసీల విధులు బాధ్యతలపై కూడా ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు, ఈక్రమంలో అందరిచూపూ విశ్వవిద్యాలయాల ప్రతిష్టను కాపాడేదిగా సిఎం తీసుకునే నిర్ణయం వైపే ఉంది. యుజిసి నిబంధనల ప్రకారం విసిల నియామకాల్లో విధిగా పాటించాల్సిన నిబంధనలను రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 28, 29, 38 సవరణలే ఈ వివాదాలకు కారణమయ్యాయి.

బివి ప్రసాద్