తెలంగాణ

జీవో 123 రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రైతులనుంచి నేరుగా భూములు కొనుగోలు చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో123ను కొట్టివేస్తూ హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 జూలై 30న జీవో 123 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోవల్ల రైతులు, భూములు సేకరించే శాఖల మధ్య ఒప్పందం కుదిరేందుకు, రైతుల నుంచి ప్రభుత్వ శాఖలు నేరుగా భూములు సేకరించేందుకు వీలవుతుంది. మెదక్ జిల్లా జరాసంగం మండలం బర్దీపూర్ గ్రామానికి చెందిన తుక్కమ్మ మరో 22మంది రైతు కూలీలు 123 జీవోను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు జడ్జి జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్ విచారణ జరిపారు. ప్రభుత్వం ప్రైవేట్ భూములను కొనుగోలు చేసేందుకు డీలర్‌గా వ్యవహరించడం సరికాదంటూ, జీవో 123ను సవాలు చేస్తూ పిటిషన్‌ను దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల వౌలిక సదుపాయాల సంస్ధ ద్వారా తమ ప్రాంతంలో నేషషనల్ ఇనె్వస్ట్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 123 ద్వారా భూములను సేకరిస్తోందని పిటీషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. తమ భూములను ప్రభుత్వం తీసుకుంటే ఎస్సీ వర్గానికి చెందిన తమకు బతుకుదెరువు ఉండదని కోర్టుకు విన్నవించుకున్నారు. తమ భూములను ప్రభుత్వం తీసుకోవడం వల్ల తాము రోడ్డున పడతామని, ఈ తరహా జీవో ద్వారా తమ భూములను ప్రభుత్వం సేకరించరాదని, తమకు పునరావాసం కల్పించకుండా జీవో అమలు చేయడం సమ్మతంకాదంటూ పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు తీర్పునిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం, పునరావాసం, రీసెటిల్‌మెంట్, తగిన నష్టపరిహారం చెల్లింపు విధానాన్ని పక్కనపెట్టి జీవో 123ను జారీ చేయడం సరికాదని పేర్కొంది. కేసును హైకోర్టు 40 నిమిషాలపాటు విచారించింది. అనంతరం ఓపెన్ కోర్టులోనే హైకోర్టు న్యాయమూర్తి తీర్పు పాఠాన్ని డిక్టేట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2013నాటి భూసేకరణ చట్టాన్ని అంగీకరిస్తూనే, తెలంగాణ రాష్ట్ర భూసేకరణ విధానం నష్టపరిహారం చెల్లింపు మార్గదర్శకాలను ఖరారు చేసిందన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని కాదని ఎటువంటి నిబంధనలను చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కోర్టు పేర్కొంది. 2013 భూసేకరణ చట్టంలోనే భూమిలేని వ్యవసాయ కార్మికులకు గుర్తింపు ఉందని, పిటీషనర్లు, కౌలుదారులు తదితరులను బాధితులుగా చట్టం పేర్కొన్నదన్నారు. భూసేకరణ వల్ల బాధితులయ్యే కుటుంబాలకు ఇచ్చే వివిధ ప్రయోజనాలను 2013 భూసేకరణ చట్టం రెండు షెడ్యూల్‌లో ప్రస్తావించారన్నారు. జీవో 123లో అభ్యంతరాలు తెలియచేయవచ్చని ఉందని, కాని 2015 నవంబర్‌లో ఇచ్చిన జీవోఎంఎస్ 214లో ఇవేమీ లేవన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జీవో 123ను రద్దు చేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది. 2013 భూసేకరణ చట్టాన్ని పక్కనపెట్టి, జీవో 123 ప్రకారం రైతులు భూములను సేకరిస్తే, రైతులకు ఒక్క పైసా కూడా రాదని హైకోర్టు పేర్కొంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రాష్ట్రాలు రైతుల నుంచి భూములను సేకరించేటప్పుడు మరింత మెరుగైన నష్టపరిహారం, పునరావాస సదుపాయం కల్పించేందుకు చట్టాలు చేసుకోవచ్చన్నారు. కానీ జీవో 123 అమలు చేస్తే 2013 భూసేకరణ చట్టం ప్రయోజనాలను హరించి వేసినట్టుగా ఉంటుందని కోర్టు తీర్పులో పేర్కొంది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పు డివిజన్ chitram...
123 జీవోను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునివ్వడంతో గాంధీభవన్ వద్ద బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు