తెలంగాణ

త్రివర్ణ తోరణంపై ఇదేనా గౌరవం? ఏడాది నుంచి అక్కడే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 3: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈనెల 9 నుంచి జాతీయ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి పల్లెలో పండుగ వాతావరణం మధ్య వేడుకలు జరిపేందుకు సిద్ధం చేశారు. జాతీయ జెండా, మూడు రంగులు కలిగిన తోరణాలతో ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు ముస్తాబవుతాయి. కానీ యేడాది కిందట కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు. ఆ తర్వాత జాతీయ పతాకంతో పాటు మూడు రంగుల తోరణాలను మరుగుదొడ్డిలో పడేశారు. నాటినుంచి అవి అక్కడే ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. జాతీయ పతాకానికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ చూసినవారు మండిపడుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పంచాయతీ కార్యాలయంలోని మరుగుదొడ్డిలో ఏడాది కాలంగా పడివున్న త్రివర్ణ తోరణాలు