తెలంగాణ

నిండుకుండ... ఎల్లంపల్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 3: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజాము వరకు జిల్లా అంతటా వానలు కురువగా, హుజురాబాద్‌లోని గ్రామ పంచాయితీ కార్యాలయ భవనం కూలిపోయింది. ఎగువ ప్రాంతంలో నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. 20.175టిఎంసిల సామర్థ్యం కాగా, ప్రస్తుతం 18టిఎంసిలకు నీరు చేరింది. నీటి ప్రవాహాం ఉదృతి కొనసాగుతుండటంతో సాయంత్రం నాలుగు గేట్లు ఎత్తారు. అలాగే ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌తో వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలోని 184 ఇళ్లు నీట మునిగిపోగా, ఆ ఇళ్ల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కోటిలింగాల, ముక్కట్రావుపేట గ్రామాలు సైతం వరద ముంపునకు గురయ్యే అవకాశాలుండగా, అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు వాగులు, వంకలు పొంగుతుండగా, చెరువులు, కుంటలు జలసిరిని సంతరించుకుంటున్నాయి. మహదేవ్‌పూర్ మండలంలోని పెద్దంపేట, లెంకలగడ్డ, పంకెన, పలిమెల, సర్వాయిపేట తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, ఆ గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రామగుండం రీజియన్‌లోని నాలుగు ఓసిపిల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 51వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కావాల్సి ఉండగా, కేవలం 1000 టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి అయింది. దీంతో సింగరేణికి భారీగానే నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజాము వరకు కురిసిన వర్షాలతో జిల్లాలో 1151.మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటున 20.2మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
బ్యాక్ వాటర్‌తో చెగ్యాంలోకి నీరు..
వెల్గటూరు: ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలంలోని చెగ్యాంలో గల ముంపు బాధితులను బుధవారం వారికి కేటాయించబడిన పునరావాస కేంద్రాలకు రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది తరలించారు. కాగా, పై నుండి వస్తున్న వర్షపు నీటి వలన ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిలువ శాతం పెరుగుతుంది. ఈ క్రమంలో మండలంలో గల రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది చెగ్యాంలో 166 కుటుంబాలు ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించగా, 132 కుటుంబాలను పునారావాస కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాలలోకి వీరిని తరలించారు. కాగా అక్కడ వారికి అవసరమైన అన్ని వసతులను ఏర్పాట్లు చేసినట్లు పెద్దపల్లి ఆర్‌డిఓ అశోక్‌కుమార్ తెలిపారు. వారం నుండి పది రోజుల వరకు అక్కడే ఉంచనున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలో గల ముంపు బాధితులందరు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని అశోక్‌కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డివిజన్ పరిధిలోని తొమ్మిది మంది తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, పెద్దపల్లి సిఐ ఎడ్ల మహేష్, ఎస్‌ఐ అంజయ్య, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జలకళతో కనువిందు చేస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు