తెలంగాణ

గుండె మార్పిడి విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/బేగంపేట, ఆగస్టు 3: సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాతృమూర్తికి అత్యంత క్లిష్టమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. బుధవారం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో జరిగిన విలేఖరుల సమావేశంలో కార్డియాలజిస్ట్‌లు పివి నరేష్‌కుమార్, ఆర్ముగమ్, రాజశేఖర్, జీవన్‌దాన్ ఇంచార్జి డాక్టర్ స్వర్ణలతతో కలిసి యశోదా ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్ రావు వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన 24 సంవత్సరాల అరుణ భర్త గోపాలకృష్ణ, కుమారుడు రెండేళ్ల కార్తిక్‌తో కలిసి పుణెలో స్థిరపడింది. గత ఏడాది జూన్ నెలలో ఆరుణ సొంత ఊరికి వచ్చి ఆకస్మాత్తుగా తీవ్ర ఆనారోగ్యానికి గురైంది. అనేక రకాల పరీక్షలు జరిపించగా చివరకు అరుణ ‘కార్డియో మయోపతి’ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. కాస్త కోలుకున్న తరువాత ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పుణెకు వెళ్లిపోయింది. తిరిగి తొమ్మిది నెలల తరువాత గత మార్చి 20న అరుణ మళ్లీ అస్వస్థతకు గురయింది. పుణెలోని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అక్కడి డాక్టర్లు ఆమె గుండె మరింత బలహీనపడి దాదాపు పనిచేయని స్థితికి చేరుకుందని, వీలైనంత త్వరగా గుండె మార్పిడి సర్జరీ చేయించుకోవాలని సూచించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి గత ఏప్రిల్ 20న వచ్చారు. అరుణ గుండె బలహీనంగా ఉందని, తక్షణమే గుండె మార్పిడి చేసుకోవాలని ఆస్పత్రి వైద్యులు సూచించారు. గత జూన్ 15న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 47 సంవత్సరాల హైదరాబాద్ నివాసి బ్రెయిన్ డెడ్ అయ్యారని, ఆయన గుండె అందుబాటులో ఉందని జీవన్‌దాన్ నుంచి సమాచారం అందింది. దీంతో యశోద ఆసుపత్రి వైద్యులు అరుణకు అదే రోజు మధ్యాహ్నం గుండె మార్పిడి శస్త్ర చికిత్సను తొమ్మిది గంటల పాటు శ్రమించి విజయవంతంగా నిర్వహించింది. పూర్తిగా కోలుకున్న అరుణను జూన్ 29న డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్ రావు వెల్లడించారు. తనకు పునర్జన్మనిచ్చిన డాక్టర్లను చూపిస్తూ అరుణ కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపింది.

సికిందరాబాద్ యశోద ఆసుపత్రిలో గుండెమార్పిడి శస్తచ్రికిత్స జరిపిన వైద్యులతో అరుణ కుటుంబసభ్యులు

నాసిరకంగా పుష్కర పనులు
విహెచ్ ధ్వజం

హైదరాబాద్, ఆగస్టు 3: పుష్కరాల పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు విమర్శించారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ స్పందించకపోవడం దారుణమని ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. గుళ్ళు, గోపురాలు తిరగడానికి సమయం కేటాయిస్తున్నారు తప్ప ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నించడం లేదని ఆయన విమర్శించారు. భవానీ ఘాట్ వద్ద వేసిన వంతెన నాసిరకంగా ఉందని, పిల్లర్ పడిపోయినా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్కర పనులపై గవర్నర్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ గవర్నర్ ఉన్నంత వరకు రాష్ట్రానికి న్యాయం జరగదని, ఆయనపై తనకు నమ్మకం లేదన్నారు. గవర్నర్‌కు ఇస్తున్న వినతి పత్రాలన్నీ ఏమవుతున్నాయో తెలియడం లేదని అన్నారు. చలో మల్లన్న సాగర్‌కు తమ పార్టీ నాయకులు తనను ఆహ్వానించలేదని, అయనా తాను వెళ్ళగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తనను ఎందుకు వచ్చారని ప్రశ్నించడం బాధ కలిగించిందని అన్నారు.

హైకోర్టు తీర్పు సర్కారుకు చెంపపెట్టు

రాచరిక పాలనను తలపిస్తున్న కెసిఆర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ధ్వజం

జగిత్యాలటౌన్, ఆగస్టు 3: భూసేకరణ చట్టం-2013ను మరుగున పెడుతూ కొత్తగా 123 జివోను తెరపైకి తీసుకురావడాన్ని హైకోర్టు తప్పుపడుతూ 123జివోను రద్దు చేయాలని తీర్పునివ్వడం తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని సిఎల్‌పి ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్ భూనిర్వాసితులు గ్రామాలకు గ్రామాలకు రాజీవ్ రహదారిని నిర్భందిస్తే పోలీసులచే లాఠీచార్జీ జరిపి అందోళనలకు అనచివేసారన్నారు.
భూసేకరణ చట్టం కంటే మెరుగైన పరిహారం ఇవ్వాలని, 123 జివోను రద్దు చేశారని, ప్రతి పక్షాలు అడ్డుకుంటే ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని అడ్డుకుంటుందని ప్రభుత్వం చౌకబారు విమర్శలు చేసిందన్నారు. కనీసం డిపిఆర్ కూడా లేదని, రాచరికపాలనను తలిపిస్తుందన్నారు. పరామర్శలకు వెళ్లీన జానారెడ్డి, నేతలను అరెస్టు చేయడం 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఇళ్లు కోల్పోయిన వారికి రెండింతలు, దళితులకు రెండున్నర ఎకరాలు, ఇతరులకు ఎకరం, సర్వం కోల్పోయిన వారికి మెరుగైనన పరిహారం ఇవ్వాలని సూచిందన్నారు. దేశంలో ఏరాష్ట్రంలోని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు పలు మార్లు జోక్యం చేసుకోవడంపై ప్రభుత్వం కళ్లు తెరవాలని జీవన్‌రెడ్డి సూచించారు.
మెరుగైన రీతిలో ప్రాజెక్టులు నిర్మించాలని, ప్రాజెక్ట్‌ల నిర్మాణ వ్యయం, తగ్గేలా, తక్కుల నిరశ్రయులు అయ్యేల సర్వే జరిపి ప్రాజెక్ట్‌లు నిర్మించాలి, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకం కాదని, మిడ్ మానేర్‌ను ఇంతవరకు నిర్మించలేకపోయిందని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 24 టిఎంసిల నీటిని కోల్పోతున్నామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని జీవన్‌రెడ్డి హితవుపలికారు. పౌర హక్కులను కాపాడుతున్న హైకోర్టుకు జీవన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డిసిసి ఉపాధ్యక్షుడు బండ శంకర్, దామోదర్‌రావు, మన్సూర్ అలీ, గర్వందుల నరేష్‌గౌడ్, తాటిపర్తి దేవేందర్‌రెడ్డి, గంగం మహేష్, మునిందర్‌రెడ్డి, రఘువీర్‌గౌడ్‌లు ఉన్నారు.