తెలంగాణ

కొత్త వైద్య సదుపాయాలు, అనుసంధానంతో అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: అపోలో ఆసుపత్రి పరిధిలో ఉన్న కేన్సర్ మేనేజిమెంట్ వౌలిక సదుపాయాల వ్యవస్ధ విభాగాలను ఇకపై అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లుగా మారుస్తున్నట్లు అపోలో ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్‌కొత్తా, అహ్మదాబాద్, బిలాస్‌పూర్, బెంగళూరు, మధురైలో అపోలో ఆసుపత్రుల ఇనిస్టిట్యూట్‌ల మధ్య అనుసంధానం నెలకొల్పనున్నట్లు ఆయన చెప్పారు. దీని వల్ల కేన్సర్ రోగులకు సమిష్టిగా ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్య సదుపాయాలను అందిస్తామని ఆయన చెప్పారు.
కేన్సర్ నివారణ ఇప్పుడు కణ జాలం నుంచి మాలిక్యులర్ స్ధాయి వైద్య చికిత్సగా మారిందన్నారు. కేన్సర్‌కు మూస తరహా వైద్య చికిత్స విధానానికి కాలం చెల్లిందన్నారు. ట్రూ బీమ్, నొవాలి టిఎక్స్, టోమోథెరపీ, ప్రొటాన్ థెరపీ తదితర ఆధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కేన్సర్ చికిత్స సంక్లిష్టతతో కూడుకుందని ఆయన చెప్పారు. ప్రతి ఏటా భారత్‌లో పది లక్షల మంది కేన్సర్ వ్యాధితో మరణిస్తున్నారన్నారు.