ఆంధ్రప్రదేశ్‌

తరుముకొస్తున్న కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 3: మహారాష్టల్రో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి శుక్రవారం నాటికి రెండు లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని, జాగ్రత్తగా ఉండాలంటూ సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) బుధవారం జిల్లా కలెక్టర్‌కు సమాచారం పంపింది. కృష్ణానదిపై ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు ఇప్పటికే నిండినందున వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల చేయనున్నారు. దీంతో కృష్ణానది వెంట శ్రీశైలం జలాశయం వరకు ఉన్న తీర గ్రామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ విజయ మోహన్ తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. మహారాష్టల్రోని కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ఒకే రోజు సుమారు 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని కృష్ణానది ఉగ్ర రూపంతో ప్రవహిస్తోందని సిడబ్ల్యుసి హెచ్చరించింది. నదిలో సుమారు 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుందని కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు తాజా సమాచారం పంపింది. సిడబ్ల్యుసి హెచ్చరికల నేపథ్యంలో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల నుంచి దిగువకు నీటి విడుదలను అధికం చేసి నీటి నిల్వ పరిమాణాన్ని తగ్గిస్తున్నారు. తాజా బులెటిన్ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల పెంచారు. ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల నుంచి బుధవారం సాయంత్రం విద్యుత్ ఉత్పత్తి అనంతరం 28,326 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం జలాశయం నీటిమట్టం 828 అడుగులకు చేరుకోగా నీటి నిల్వ 47.52 టిఎంసీలుగా నమోదైంది. జూరాల నుంచి ప్రస్తుతం 16వేల క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సిడబ్ల్యుసి హెచ్చరికల నేపథ్యంలో గురువారం జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరుతుంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తరువాత వరద ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని నీటిని విడుదల చేస్తారని అధికారులు పేర్కొంటున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టిఎంసిలకు గాను 7.50 టిఎంసిల నీరు నిల్వ ఉంది. దిగువకు 40 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
పుష్కర పనులు వేగిరం
కృష్ణానదికి వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని పుష్కర ఘాట్ల నిర్మాణం పనులు గురువారం సాయంత్రానికి పూర్తిచేయాలని కలెక్టర్ విజయమోహన్ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.