తెలంగాణ

ఉద్యోగులకు వేతనాలు సకాలంలోనే చెల్లించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, అలవెన్స్‌లు సకాలంలో చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల చెల్లింపులను నిలిపివేసినట్టు వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం నెల మొదటి పనిదినాన వేతనాలు చెల్లిస్తామని, ఈ మేరకు ఈ నెల మొదటి పనిదినం ఆగస్టు 2 అయిందని, ఇదే రోజు వేతనాలు, పింఛన్లు చెల్లించామని స్పష్టం చేశారు. దేశంలో ఆదాయం పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే, 2016 తొలి నాలుగు నెలల్లో ప్రభుత్వ చెల్లింపులు 20 శాతం పెరిగాయని, ఈ మేరకు నిధులు ఖర్చు చేశామని ఈ ప్రకటనలో వివరించారు.

విద్యార్థుల సేవలకు ఇంటర్ బోర్డు యాప్

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులు, యాజమాన్యాల సేవలకు యాప్‌ను రూపొందించింది. గత ఏడాదిగా 22సేవలను ఆన్‌లైన్‌లోనే అందిస్తున్న ఇంటర్ బోర్డు బుధవారం కొత్తగా యాప్‌ను రూపొందించింది. 22 సేవల్లో 15 విద్యార్థులకు సంబంధించినవి, ఏడు యాజమాన్యాలకు చెందివని ఉన్నాయి. మైగ్రేషన్ సర్ట్ఫికెట్, డూప్లికేట్ మార్క్సు మెమో, డూప్లికేట్ పాస్ సర్ట్ఫికెట్, ఈక్వివలెన్స్ సర్ట్ఫికెట్, ఎలిజిబిలిటీ సర్ట్ఫికెట్, నేమ్ కరెక్షన్, అటెండెన్స్ మినహాయింపు, రీ వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్, రీ కౌంటింగ్ ఆఫ్ మార్క్సు, అప్లికేషన్ స్టేటస్ వంటి ఆప్షన్లను ఈ యాప్‌ద్వారా అందిస్తున్నారు. విద్యార్థులు ఈ యాప్ ద్వారా దరఖాస్తుపంపడంతో పాటు ఫీజును కూడా చెల్లించవచ్చు.