తెలంగాణ

ఏడాదిలో దేవాదుల పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: దేవాదుల ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద నిధులు ఇచ్చిందని, వచ్చే ఏడాది జూన్ వరకు పూర్తి చేయకపోతే కేంద్రం వద్ద తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఇంజనీరింగ్ అధికారులను హెచ్చరించారు. ఆరు నూరైనా వచ్చే ఏడాదిలోగా దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, ఇఎన్‌సి మురళీధర్‌రావు, దేవాదుల ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బి వెంకటేశ్వర్లు తదితరులతో మంత్రి హరీశ్‌రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్ణీత గడువులోగా దేవాదుల ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి డిఇఇలకు కాలపరిమితి విధించాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టులను రద్దు చేసి ఇతర సంస్థలకు అప్పగించాలని కూడా మంత్రి ఆదేశించారు.
దేవాదుల ప్రాజెక్టులో జాయింట్ ఇంజనీర్లుగా చేరిన వారు చీఫ్ ఇంజనీర్లుగా పదోన్నతులు పొందారు కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్, సర్కిల్ వారీగా కార్యాచరణను రూపొందించుకుని పనులను వేగవంతం చేయాలన్నారు. నష్కల్, చెన్నూర్, పాలకుర్తి రిజర్వాయర్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత రెండు రోజుల పాటు శ్రీరామ్‌సాగర్ రెండవ దశ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్టు హరీశ్‌రావు చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు కోసం వరంగల్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో కలిపి మొత్తంగా 9199 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 3121 ఎకరాల సేకరణ మాత్రమే జరిగిందని, మిగతా భూ సేకరణ కూడా త్వరితగతిన జరగాలని మంత్రి ఆదేశించారు. అలాగే శ్రీరామ్‌సాగర్ రెండవ దశకు 2490 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 1058 ఎకరాల సేకరణ మాత్రమే పూర్తి అయిందని అధికారులు వివరించారు. భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి ప్రత్యేకంగా తహసీల్దార్లను నియమించాలని మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్‌లోగా ధర్మసాగర్‌లో 1.03 టిఎంసిల నీటిని నింపడానికి చర్యలు తీసుకోవాలని, గేట్లు ఏర్పాటు చేయాలని, పనులు సకాలంలో పూర్తి కాకపోతే ఇఇని బాధ్యుడ్ని చేసి చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.