తెలంగాణ

కొత్తగా మరో ఐదు మద్యం డిపోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 4: మద్యాన్ని దుకాణాలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్టవ్య్రాప్తంగా కొత్తగా ఐదు మద్యం డిపోలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల పరిధిలో ఇప్పటికే 17మద్యం డిపోలు ఉండగా, కొత్తగా మరో 5ఏర్పాటు కానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల పరిధిలోనే కొత్త డిపోలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, నల్గొండ జిల్లా సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట, రంగారెడ్డి జిల్లా మోహినాబాద్, మెదక్ జిల్లా సిద్ధిపేటలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు ఎక్సైజ్ శాఖాధికారులు లేఖ రాశారు. అలాగే అవసరమైతే ప్రైవేటు గోడౌన్లను అద్దెకు తీసుకోనున్నారు. ఒక్కొక్క చోట వసతుల కల్పన కోసం 2కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. కొత్తగా నిర్మించే డిపోలను ఆధునిక పద్ధతుల్లో సాంకేతికతను ఉపయోగించి నిర్మించనున్నారు.