తెలంగాణ

పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: ఇప్పటివరకు దేశంలో తాము పర్యటించిన రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే పరిశ్రమలు, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని యునైటెడ్ కింగ్‌డమ్ బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ ప్రతినిధి బృందం అభిప్రాయపడింది. ఈ బృందం ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావును గురువారం కలిసింది. భారత దేశంలోని ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అంశాన్ని పరిశీలించేందుకు ఈ బృందం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలతో భేటీ అవుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన బృందం ఇప్పటివరకు తాము సందర్శించిన రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే మంచి వాతావరణం ఉందని స్పష్టం చేసింది. యుకె నుంచి అత్యధిక పెట్టుబడులను తెలంగాణకు తరలించేందుకు సహకరిస్తామని ఈ బృందం తెలిపింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని పలు పారిశ్రామిక విధానాలను తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని బృంద సభ్యులు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా రిస్క్ అసెస్‌మెంట్, ఎగ్జిట్ పాలసీ, రిఫార్మ్స్ సెన్సిటైజేషన్, డిస్క్యూట్ రిడ్రెస్సల్ మెకానిజం వంటి అంశాల్లో ఈ బృందం సలహాలను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ నూతన రాష్టమ్రని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కొత్త ప్రారంభంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.
తెలంగాణలో వినూత్న పాలసీలు రూపొందించామని కెటిఆర్ యుకె బృందానికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక, ఐటి పాలసీ రూపకల్పనలో పరిశ్రమల భాగస్వామ్యం ఉందని, ఈ మేరకు పరిశ్రమల వారితో అనేక సమావేశాలు నిర్వహించామని, పా లసీ ప్రకటన తర్వాత కూడా వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని, వారి సలహాలలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. వినూత్న విధానాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుదలకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో మంత్రి కెటిఆర్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఉన్నారు.

చిత్రం.. హైదరాబాద్‌లో గురువారం మంత్రి కెటిఆర్‌ను కలిసిన యునైటెడ్ కింగ్‌డమ్ బిజినెస్ ఇన్నోవేషన్ బృంద సభ్యులు