తెలంగాణ

దోపిడీ దొంగల హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, ఆగస్టు 4: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడేందుకు మహారాష్టక్రు చెందిన దొంగల ముఠా విఫలయత్నం చేసింది. బుధవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో నాల్గవటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మినగర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ట్రాన్స్‌కో ఎ.ఇ శ్రీహరి ఇంటికి నలుగురు సభ్యులు గల దొంగలు చేరుకున్నారు. శ్రీహరి అమెరికా పర్యటనలో ఉండగా, ఆయన కుటుంబీకులు ఇంట్లో ఉంటున్నారు. అక్కడికి చేరుకున్న దొంగలు శ్రీహరి ఇంటి కిటికీల ఊచలను తొలగించి లోనికి చొరబడేందుకు సిద్ధమయ్యారు. అయితే కిటికీలు తొలగిస్తున్న సమయంలో శబ్ధాలు రావడంతో శ్రీహరి ఇంట్లో పై అంతస్తులో అద్దెకు ఉంటున్నవారు మేల్కొని చూడగా, వారికి దొంగలు కనిపించడంతో శ్రీహరి కుటుంబీకులకు ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. వారు వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో పాటు పెద్ద పెట్టున దొంగలు, దొంగలు అని కేకలు పెట్టారు. ఆ సమయంలో సమీపంలోనే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు హుటాహుటిన శ్రీహరి ఇంటి వద్దకు చేరుకోగా, పోలీసులను చూసిన దొంగలు వారిపై రాళ్లు రువ్వుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబడించగా, దొంగలు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేయడంతో సంజీవ్ అనే కానిస్టేబుల్ చేతి వేలు తెగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. దొంగలు గోడ దూకి పారిపోయే క్రమంలో పోలీసులు ఎంతో తెగువను ప్రదర్శిస్తూ వారిని పట్టుకున్నారు. దోపిడీకి యత్నించిన దొంగలను పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. పట్టుబడ్డ దొంగలను మహారాష్టక్రు చెందిన వారుగా గుర్తించినట్లు తెలిసింది. వీరికి ఇదివరకు జరిగిన దోపిడీలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఈ ముఠాలో ఇంకెంత మంది సభ్యులున్నారు, ఎక్కడెక్కడ దోపిడీ, దొంగతనాలు చేశారు తదితర వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.