తెలంగాణ

మోత్కూరులో చేనేత క్లస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: నల్గొండ జిల్లా మోత్కూరులో ఇకత్ చేనేత క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా టిఆర్‌ఎస్ ఎంపి బూర నరసయ్య గౌడ్‌కు రాసిన లేఖలో తెలిపారు. మోత్కూరులో ఒక కోటీ 73 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఇకత్ చేనేత క్లస్టర్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తమ వంతు కింద 143.38 లక్షల రూపాయలు ఇస్తుందని మిశ్రా తమ లేఖలో పేర్కొన్నారు. సంప్రదాయ పరిశ్రమల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన స్ఫూర్తి పథకం కింద ఈ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన నరసయ్యగౌడ్‌కు రాసిన లేఖలో వివరించారు. తన లోక్‌సభ నియోజకవర్గంలోని దాదాపు నాలుగు వందల మంది అత్యంత నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులు ప్రస్తుతం ఇకత్ చేనేత బట్టలను తయారు చేస్తున్నారని నరసయ్య గౌడ్ తెలిపారు. ఇకత్ క్లస్టర్ ఏర్పాటు వలన ఇలాంటి ఎంతోమంది నైపుణ్య చేనేత కార్మికులకు మేలు జరగటంతోపాటు సంప్రదాయ పరిశ్రమల పరిరక్షణకు తోడ్పడుతుందని ఆయన తెలిపారు.