తెలంగాణ

త్రివర్ణ తోరణాలు తొలగించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 4: కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకం, త్రివర్ణ తోరణాలను గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పనికి రాని మరుగుదొడ్డిలో పడేసి జాతి ప్రతిష్టను అవమాన పర్చడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 4న ‘ఆంధ్రభూమి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన ‘త్రివర్ణ తోరణంపై ఇదేనా గౌరవం..? అనే కథనానికి సిరిసిల్ల ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్ స్పందించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి మరుగుదొడ్డిలో పడేసిన జాతీయ పతాకంతో పాటు మూడు రంగుల తోరణాలను తొలగించాలని ఎమ్పిడీవో చిరంజీవిని ఆదేశించారు. దాంతో గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. సర్పంచ్ భీమేశ్వర్, పంచాయతీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను గౌరవించడం ఇదేనా అంటూ మండి పడ్డారు. సిబ్బంది తెలియక పడేశారేమో అని సర్పంచ్ భీమేశ్వర్ సమాధానమివ్వడంతో మరింతా ఆగ్రహించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

చిత్రం.. మరుగుదొడ్డిలో నుంచి తొలగించిన త్రివర్ణ తోరణాలు