తెలంగాణ

పార్టీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండూరు, ఆగస్టు 4 : పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఏ పదవినై నా చేపట్టడానికి తాను సిద్ధమేన ని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా చండూరు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలందరూ గ్రూపులను పక్కన బెట్టి సమష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు కానీ హామీలను ఇచ్చి ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ల హామీలు ఇచ్చి ఇప్పటివరకు వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉండేదని, కానీ ప్రస్తుతం టిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల తెలంగాణగా మార్చిందని ఆయన ఎద్దేవా చేశారు.